Makhana: మఖానా పోషకాల ఖజానా.. రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆ రోగాలన్నీ మాయం!

మఖానాగా పిలుచుకునే తామర గింజల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

వీటిలోని ప్రొటీన్, ఫైబర్.. ఆకలిని నియంత్రించి, బరువును అదుపులో ఉంచుతాయి.

మఖానాలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఆరోగ్య సమస్యలను దరిచేరనీయవు.

రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయి.

మఖానాలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

ఇవి ఎముకలు, దంతాల్ని దృఢంగా మారుస్తాయి. రక్తహీనత బారినుంచి కాపాడుతాయి.

రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. మలబద్ధకం సమస్య దూరమవుతుంది.