healthy food: రోజూ తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే!
నేటి యుగంలో ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు. అందుకే ప్రతీ రోజు మన ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాన్ని తీసుకోవాలి.
ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం కచ్చితంగా తీసుకోవాలి.
ఆకుపచ్చని కూరగాయలు, పండ్లలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచుతాయి.
తృణధాన్యాలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పప్పుధాన్యాల్లోని పోషకాలు కండరాల నిర్మాణానికి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి.
ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్లు, చేపలు, నట్స్ తీసుకోవాలి.
పాల ఉత్పత్తుల్లోని ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.