‘మాతృదేవోభవ’... ఈ సినిమా గుర్తుకు రాగానే థియేటర్లలో ప్రేక్షకులకు ఖర్చీఫ్‌లు ఇచ్చిన రోజులు గుర్తుకువస్తాయి.
అంతలా తన అభినయంతో ఆడియన్స్‌ని కంట తడి పెట్టించింది అలనాటి నటి మాధవి.
90 వ దశకంలో కెరీర్ పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డారు.
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా ఎదిగారు.
‘మరో చరిత్ర’, ‘ఖైదీ’ చిత్రాలు ఆమె కెరీర్‌లో మరిచిపోలేని సినిమాలు.
17 ఏళ్ల సినీ ప్రయాణంలో అగ్ర హీరోలతో నటించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.
1996లో వ్యాపారవేత్త రాల్ఫ్ శర్మను వివాహం చేసుకుని న్యూజెర్సీలో స్థిరపడ్డారు.
వీరికి ముగ్గురు కుమార్తెలు.. తరచుగా ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటున్నారు మాధవి.