పూజిత పొన్నాడ.. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తెలుగు హీరోయిన్.

ఈ ముద్దుగుమ్మ 1989 అక్టోబర్ 5న విశాఖపట్నంలో జన్మించింది. చెన్నైలో పెరిగింది.

ఇంజనీరింగ్ పూర్తి చేసిన పూజిత.. టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేసింది.

2015లో 'ఉప్మా తినేసింది' లఘు చిత్రంతో చిత్ర రంగ ప్రవేశం చేసింది.

2016లో వచ్చిన 'ఊపిరి' మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత రాజు గాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, 7 వంటి చిత్రాల్లో నటించింది.

కల్కి, రన్, మిస్ ఇండియా, ఓదెల రైల్వే స్టేషన్ మూవీస్ తో మరింత పేరు తెచ్చుకుంది.

ఈ ఏడాది 'హరి హర వీరమల్లు' చిత్రంలో ఓ ఐటెం సాంగ్ కూడా చేసింది.