2019 లో దొరసాని సినిమాతో పరిచయమైంది శివాత్మిక రాజశేఖర్
రంగమార్తాండ, పంచతంత్రం సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.
తమిళ్‌లోనూ పలు సినిమాల్లో నటించింది.
నవంబర్ 7న విడుదలైన ఆరోమలెతో డీసెంట్ హిట్‌ను అందుకుంది.
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటోంది.
అయితే ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తక్కువే.
ఇండస్ట్రీలో టాలెంట్ కంటే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చింది.
ఫాలోవర్స్ లేరని తనను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయని వాపోయింది.