Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Political harmony: సామరస్యానికి ఆమడ దూరం

Political harmony: సామరస్యానికి ఆమడ దూరం

పార్లమెంట్‌లో పాలక భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగైస్‌ పార్టీ రాను రానూ బద్ధ శత్రువుల్లా మారి పోతున్నాయి. ఇందులో ఒకటి అధికార పక్షంగానూ, మరొకటి ప్రతిపక్షంగానూ ఉండడం సహజమే. కానీ, బద్ధ శత్రువుల్లా మారిపోవడం మాత్రం పూర్తిగా అసహజం. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కావడం తరువాయి, ప్రభుత్వ విధానాలను గుడ్డిగా వ్యతిరేకిం చడమే కాంగైస్‌ తదితర ప్రతిపక్షాలు తమ లక్ష్యాన్ని చేసుకుంటున్నాయి. ఈ “టగ్‌ ఆఫ్‌ వార్‌లో దేశ హితం బలయిపోతోంది. గతంలో పార్లమెంట్‌లో చర్చల్లో పాల్గొనడానికి, ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రతిపక్షాలు ఒక ఎజెండాను రూపొందించుకునేవి. ఇందిరా గాంధీ హయాం వరకు పార్లమె౦ట్‌ సమావేశాలు ఈ విధమైన పకడ్బందీ ఎజెండాలతోనే నడిచేది. రాజీవ్‌ గాంధీ హయాం నుంచి ఈ పరిస్థితిలో గణనీయంగా మార్పు చోటు చేసుకుంది. ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేసినా దాన్ని గట్టిగా వ్యతిరేకించడం, సభలో గందరగోళం సృష్టించడం, కార్యక్రమాలను ముందుకు సాగనివ్వకపోవడం ఒక రివాజుగా, సంప్రదాయంగా మారిపోయింది. ప్రతిపక్షాలు హోం వర్మ్‌ చేసుకు రావడమనేది మటుమాయ మైపోయింది.
ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపించింది. సభలో అడుగు పెట్టిన మరు క్షణం నుంచి పాలక, ప్రతిపక్షాలకు మధ్య వాదోపవాదాలు ప్రారంభం అయ్యాయి. వీటిని వాదోపవాదాలనో, చర్చలనో భావించడం కూడా కష్టమే. ఈ డు పక్షాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రసంగించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించడ౦ మొదలు పెట్టగానే సభలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌
అరుపులు, కేకలు, నినాదాలతో సభ మార్మోగిపోయింది. సాధారణంగా ఆరోగ్యకర పార్లమెంటరీ వ్యవస్థలో పాలక, ప్రతిపక్షాల మధ్య ఒకరంటే ఒకరికి గౌరవ భావం ఉండాలి. ఒకరి భావ ప్రకటన స్వేచ్చను మరొక రు గుర్తించాలి. తమ మధ్య సైద్ధాంతిక విభేదాలు తప్ప వ్యక్తిగత విభేదాలేవీ లేవనే అభిప్రాయం కలిగించాలి. అటువంటి సుహృద్భావమే లేనప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో వర్ధిల్లే అవకాశమే ఉండదు. తమను ఎవరో అణగదొక్కేస్తున్నారని, తాము తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోకపోతే తమ మనుగడకే ప్రమాదమని పార్టీలు భావించే పక్షంలో ఇక ప్రజాస్వామ్యానికే ఉనికి ఉండదు. దురదృష్టవశాత్తూ, పాలక, ప్రతిపక్షాలు మధ్య ఇప్పుడు ద్వేషమే తప్ప సుహృద్భావం ఎక్కడా మచ్చుకైనా కనిపించడం లేదు.
గతంలో కూడా పాలక, ప్రతిపక్షాల మధ్య ఆవేశకావేషాలు పేట్రేగిపోతుండేవి. మైకులు విసిరేసుకోవడం, కుద్చీలు విరగ్గొట్టడం వంటివి కూడా జరిగేవి. అయితే, అవి కొంత వరకే పరిమితం. ఆ తర్వాత ఆరోగ్యకర చర్చలు జరిగేవి. పైగా ఈ వాదోపవాదాలు, విభేదాలు పార్లమెంట్‌ నుంచి బయటికి వెళ్లేవి కావు. ఇప్పుడు ఎక్కడైనా కత్తులు దూసుకోవడమే కనిపిస్తోంది. ఎమర్జెన్సీ, బోఫోర్స్‌ వంటి వివాదాస్పద అంశాలు చర్చకు వచ్చినప్పుడు కూడా పాలక, ప్రతిపక్షాల మధ్య సంబంధాలు తెగిపోలేదు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగైస్‌ పార్టీకి నాయకుడైన రాహుల్‌ గాంధీ తనను తాను ఆధునిక రాజకీయాలకు అనుగుణంగా పునర్నిర్మించుకోవాల్సి ఉంది. పునరావిష్కరించుకోవాల్సి ఉంది. ఒక యువ నాయకుడుగా యువ రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలవాల్సిన రాహుల్‌ గాంధీలో ఆ రకమైన పరిణతి పూర్తిగా మృగ్యమైపోయింది. నాయకత్వ లోపం కారణంగానే ఆయన పార్టీ ప్రస్తుతం అనేక బలహీనతలతో సతమతమవుతోంది.
రెండున్నర దశాబ్దాల పైబడి రాజకీయ రంగంలో ఢక్కామొక్కీలు తిన్న సోనియా గాంధీ సైతం ఒక నాయకురాలిగా ఎదగడం జరగలేదు. ఆమె పార్టీని ఏదో విధంగా నడిపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప, పూర్తిగా పార్టీకి సారథ్యం వహించడం, గత కాలపు వైభవాన్ని మళ్లీ తీసుకు రావడం వంటి ఆశయాలకు ఇంకా దూరంగానే ఉన్నారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలకు ఆమె దగ్గర ఎటువంటి పరిష్మారాలూ లేవు. పార్టీని పునరావిష్మ్కరించడానికి, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ దృక్పథాన్ని మార్చడానికి ఆమె చేస్తున్న ప్రయత్నమేదీ కనిపించడం లేదు. పార్టీలోని ఇతర నాయకులు కూడా ఆమె అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. ఏతావతా, పాల్టీ ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలి మధ్య దిక్కుతోచని స్థితిలో ఉంది. భారత్‌ జోడో యాత్ర ద్వారా రాహుల్‌ గాంధీ కొద్దిగా పార్టీని పునరుజ్జీవింపజేసే ప్రయత్నం చేశారు. అయితే, చర్వితచర్వణంగా ఆర్‌. ఎస్‌. ఎస్‌, హిందుత్వ వంటి అంశాలను మాత్రమే యాత్రలో ప్రస్తావించడం జరిగింది. దీనివల్ల పెద్దగా ఉపయోగం లేకుండాపోయింది. ఈ సమస్యలు పాతబడిపోయాయని, దేశంలోని యువతకు మార్గదర్శనం చేయడానికి ఒక గొప్ప విజన్‌ను ప్రకటించాల్సి ఉంటుందని ఆయన గ్రహించడం లేదు.
ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి నరేంద్ర మోదీ తమ పార్టీని కొత్త ఆశయాలకు, కొత్త లక్ష్యాలకు అనుగుణంగా తీర్చి దిద్దుతూ పార్టీని సమూలంగా మార్చివేశారు. ప్రజల ఉద్దేశాలను, మనోభావాలను శంకించడం వల్ల ఉపయోగం ఉండదు. రాహుల్‌ గాంధీ ఇంకా పాత నినాదాలకే కట్టుబడి ఉండడం వల్ల రాజకీయంగా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. పార్టీలోని నాయకులలో చాలా మంది ఇప్పటికీ కుమ్ములాటలు, వెన్చుపోట్లు, పరస్పర ఆరోపణలు వగైరాలలోనే మునిగి తేలుతున్నారు.
పార్టీలో పైపై మెరుగులకు ఇక స్థానం లేదు. పార్టీకి పూర్తి స్థాయిలో నాయకత్వం వహించి, పార్టీని కింద నుంచి పైవరకు పునర్నిర్మించే పనిని చేపట్టాలి. ఆ బాధ్యతను రాహుల్‌ గాంధీ నెత్తిన వేసుకోవాలి. పార్టీ బాధ్యతనే స్వీకరించలేని వ్యక్తి దేశ పాలనా బాధ్యతలను ఏ విధంగా భుజాలకెత్తుకోగలుగుతాడు? పార్లమెంట్‌ను స్తంభింపజేయడం, సభలో గందరగోళ పరిస్థితులు సృష్టించడం వంటివి పురాతన వ్యూహాలు. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. దేశ సమస్యలకు సరికొత్త పరిష్కారాలు కనుగొనడానికి పాలక పక్షానికి సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News