ఈనెలాఖరులోపు ప్రభుత్వం నిర్మించే బీసీ ఆత్మగౌరవ భవనాలకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, తెలంగాణ స్టేట్ వెల్ఫేర్ ఇన్ర్పాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఉన్నతాధికారులు, హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్న సమావేశంలో ఈ నెలాఖరు కల్లా అన్ని భవనాలు టెండర్లు పూర్తి చేసుకొని మార్చిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు మంత్రి గంగుల. వీటిలో ఆయా కులాల ఆత్మగౌరవం ప్రతిఫలించేలా నిర్మించుకోవడానికి కుల సంఘాల ట్రస్టులకే నిర్మాణ బాధ్యతలు సైతం అప్పగించామన్న మంత్రి 13 సంఘాలు సొంతంగా భవానాల్ని నిర్మించుకుంటున్నాయని మిగతా భవనాలను ప్రభుత్వమే నిర్మిస్తుందన్నారు.