Sunday, October 6, 2024
HomeదైవంSecrets: మంత్రానికి శక్తి ఉందా ? మంత్రం అంటే ఏమిటి ?

Secrets: మంత్రానికి శక్తి ఉందా ? మంత్రం అంటే ఏమిటి ?

ప్రతి అక్షరానికి ఒక శక్తి ఉంటుంది. ఏ అక్షరం ఏ అక్షరంతో కలిపితే ఏ శక్తి పుడుతుందో మన ఋషులు తమ తపోశక్తి ద్వారా గ్రహించారు. వాటితో మంత్రాలు సృష్టించారు. వాటి శక్తి అద్భుతం. కానీ ఇది నిజమేనా అని చాలామందికి సందేహం. ఆసందేహం ఇప్పుడు చెప్పబోయే వివరణ చదివితే తీరుతుంది. ఒక వ్యక్తిని తిట్టినా, పొగిడినా, ప్రేమతో మాట్లాడినా ఆయా సందర్భాలను బట్టి స్పందిస్తున్నారు. ఉదాహరణకి సన్నాసి అంటే తిట్టు. సన్యాసి అంటే లోక శ్రేయస్సు కోరేవాడు. ఇది మూడు అక్షరాల కలయికే. కానీ ఒకదానికి ఒకటి వ్యతిరేకం. ఒకడు ఏమి పట్టించుకోకుండా తిరిగేవాడు, మరొకడు ఎవరితో సంబంధం లేకున్నా లోకంలో అందరిక్షేమం కోరేవాడు. పదాల కలయిక వల్ల అర్థంలో జరిగిన మార్పు ఇది. సన్నాసి అంటే ఒకలా స్పందిస్తాడు. సన్యాసి అంటే ఒకలా స్పందిస్తాడు. ఈపదాలకే ఇంత శక్తి ఉంటే మంత్రానికి ఇంకెంత శక్తి ఉంటుంది.
మనిషిలో కదలికలకి మనం సాధారణంగా వాడే పదాలు భాష రూపంలో ఎలాగైతే ఉన్నాయో, దేవతలని కదిలించే మంత్రాలు అలానే ఉన్నాయి. ప్రతి అక్షరానికి శక్తి ఉంది. శబ్దం, అర్థం అనే రెండు గుణాల కలయికే అక్షరం. దీనిని వేటితో కలిపి ఏశబ్దం సృష్టి చేస్తామో అదే మనకి దొరుకుతుంది. మంత్రానికి శక్తి ఉందన్నది యధార్థం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News