Saturday, November 23, 2024
HomeతెలంగాణPeddapalli: జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు బంద్

Peddapalli: జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు బంద్

డాక్టర్ పై దాడికి నిరసనగా..

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం సిద్ధార్థ హాస్పిటల్‌ పైన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పెద్దపల్లి జిల్లా ఐఎంఏ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రమకాంత్‌ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సిద్ధార్థ పిల్లల హాస్పిటల్‌ పైన జరిగిన దాడి హేయమైన చర్య భావిస్తున్నామన్నారు.

- Advertisement -

డాక్టర్‌ కొక్కుల రాజేష్‌ పైన కత్తితో దాడి చేయడం వల్ల తీవ్ర గాయాలపాలయ్యారన్నారు. అందుకు నిరసనగా నేటి నుండి వైద్య సేవలు నిలుపువేస్తున్నామన్నారు. నేడు రాష్ట్ర ఐఎంఏ ఆధ్వర్యంలో జరిగిన సంఘటనకు నిరసనగా చలో పెద్దపల్లి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్లు డిమాండ్‌ చేశారు. జరిగిన సంఘటనను ప్రజలందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News