పెద్దపల్లి పట్టణంలో సోమవారం రోజున వినాయక నిమజ్జనం సందర్భంగా ఎల్లమ్మ గుండమ్మ చెరువును సందర్శించి నిమర్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమర్జనం ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని చర్యలు తీసుకోవాలని రామగుండం సీ.పీ, పోలీసు యంత్రాంగానికి మరియు మున్సిపల్ శాఖ అధికారులకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
తొమ్మిది రోజులు ఎంతో నిష్ఠతో పూజించిన ఆ గణనాథుని నిమర్జనం సందర్భంగా నిమర్జన వేడుకలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేశామని ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఎమ్మెల్యే విజయరమణ రావు తెలిపారు. చెరువుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి సూచనలు చేశారు. పెద్దపల్లి ప్రజలు అందరూ నిమర్జనానికి సంబంధించిన సిబ్బందికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రామగుండం కమిషనర్ సీపీ శ్రీనివాస్ , డిసిపి చేతన , పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ పోలీస్ ఉన్నత అధికారులు, మున్సిపల్ అధికారులు పెద్దపల్లి పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.