Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభMS Subbalakshmi biopic: ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా విద్యాబాలన్

MS Subbalakshmi biopic: ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా విద్యాబాలన్

స్వయంగా విద్యా సుబ్బలక్ష్మి ఫ్యాన్

బయోపిక్ లంటే కాసులు కురిపించే ఫార్ములాగా మారిన ఈ రోజుల్లో ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కూడా తెరకెక్కేందుకు సర్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇది ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టే అయినా తాజాగా సుబ్బలక్ష్మి జయంతి సందర్భంగా విద్యాబాలన్ ఫోటోషూట్ చూస్తుంటే ఈ బయోపిక్ లో ఆమె నటించటం ఖాయమైనట్టు హింట్ ఇచ్చినట్టుంది. పైగా సుబ్బలక్ష్మికి తాను పెద్ద అభిమాని అని పలుసందర్భాల్లో విద్యా స్వయంగా ప్రకటించి ఇప్పుడు ఇలా ఫోటో షూట్లు చేసేప్పటికి మరో బయోపిక్ లో విద్యా మెరవనున్నట్టు స్పష్టమవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News