Friday, September 20, 2024
HomeతెలంగాణGarla: వైభవోపేతంగా గణేశుడి శోభాయాత్ర

Garla: వైభవోపేతంగా గణేశుడి శోభాయాత్ర

భక్త జనం జేజేల నడుమ గంగమ్మ ఒడికి చేరిన గణపయ్య

నవరాత్రులు మండపాల వద్ద భక్తులు ఉత్సవ కమిటీలు భక్తితో నిష్టగా గణపయ్యకు నిత్యం పూజలు హోమాలు అన్నదానాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మండలంలోని పలు గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో గణపతి బప్పా మోరియా బోలో గణేష్ మహరాజ్ కి జై అంటూ దేవుని నామస్మరణతో భక్తజనం జేజేల నడుమ గంగమ్మ ఒడిలోకి గణపయ్యను సాగనంపి పోయిరావయ్య గణపయ్య అంటూ ఘనంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -

మండల కేంద్రంలోని విగ్రహాలు చుట్టుపక్కల గ్రామాల్లోని విగ్రహాలను కమిటీలు వినాయకుడికి పూజలు నిర్వహించి ఉద్వాసన జరిపించి పూలమాలలతో అలంకరించిన ప్రత్యేక వాహనాలలో ప్రధాన పురవీధుల గుండా శోభాయాత్రలో డప్పు చప్పుళ్ల నడుమ భక్తులు నృత్యాలు చేస్తూ జై బోలో గణేష్ మహరాజ్ అనే నామస్మరణలతో వీధులు మారుమోగగా వైభవంగా ఊరేగింపు నిర్వహిస్తున్న గణపతి వాహనాలకు ఇంటింటా హారతులు అందించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే స్థానిక పాకాల ఏటి చెక్ డ్యాం వద్ద నిమజ్జన కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా ఎస్సై జీనత్ కుమార్ గట్టి పోలీస్ బందోబస్తును నిర్వహించి పర్యవేక్షించారు.

పాకాల ఏటి సమీపంలోకి పిల్లలు మహిళలు యువకులు రాకుండా భారీ గేట్లను ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది క్రమ పద్ధతిలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. మండపాల వద్ద వినాయకుడి చేతి లోని లడ్డు వేలం పాటను నిర్వహించగా కొందరు భక్తులు అధిక మొత్తంలో పాడి లడ్డూను కైవసం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామపంచాయతీ సిబ్బంది పోలీస్ సిబ్బంది వివిధ రాజకీయ నాయకులు ప్రముఖులు యువత ఉత్సవ కమిటీలు భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News