Saturday, September 21, 2024
HomeతెలంగాణHyd: డ్వాక్రా ఉత్పత్తులకు కామన్ బ్రాండింగ్

Hyd: డ్వాక్రా ఉత్పత్తులకు కామన్ బ్రాండింగ్

త్వరలోనే రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మహర్దశ పట్టనుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల సంఘాల ఉత్పాదక వస్తువులకు కామన్ బ్రాండింగ్ ఏర్పాటు కానుంది. తెలంగాణ ముద్ర ఉండేట్లుగా బ్రాండ్ పేరు ఉండనుంది. మహిళల వస్తువులకు సార్వత్రిక గుర్తింపునకు సెర్ప్ (పేదరిక నిర్మూలనా సంస్థ) ప్రయత్నాలు చేస్తోంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్, లేబిలింగ్ కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఫ్లిప్ కార్డ్ సంస్థ తో ఒప్పందం కాగా, అమెజాన్ వంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలతో మరిన్ని ఒప్పందాలు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు నిర్ణయించారు. పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి సెక్రటరీ సెర్ప్ సీఈఓ సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయం మంత్రుల నివాసంలో ఈ మేరకు సమీక్షించారు. త్వరలోనే పలు సంస్థలతో ఒప్పందాలు, మహిళా ఉత్పత్తుల కు మార్కెటింగ్ కోసం చేసుకోవాలని మంత్రి చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక మహిళా సంఘాలు స్వయంగా అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయని.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా కూడా వారు తయారు చేస్తున్న నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల మార్కెటింగ్ పలు విధాలుగా జరుగుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఫ్లిప్ కార్డ్ వంటి సంస్థలతో కూడా ఒప్పందాలు కుదిరాయని.. అయితే, తెలంగాణ మహిళా సంఘాలు తయారు చేస్తున్న వస్తువులకు మంచి డిమాండ్ ఉందని.. ఆ డిమాండ్ కు తగ్గట్లుగా, మరింత ఆకర్షణీయంగా లేబిలింగ్, ప్యాకింగ్ చేస్తూ, బ్రాండింగ్ ఏర్పాటు చేస్తే, మన వస్తువులకు మరింత డిమాండ్ పెరిగి, కొనుగోలు బాగా సాగి, లాభదాయకంగా ఉంటుందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News