Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు నాదెండ్ల సంఘీభావ మహా యాగం

పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు నాదెండ్ల సంఘీభావ మహా యాగం

ప్రత్యేక పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలు..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ చేసిన నెయ్యి వినియోగం భక్త జనకోటి మనోభావాలను దెబ్బ తీసింది. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పాలక మండలి వ్యవహార శైలి, లడ్డూ కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ మహా యాగం నిర్వహిస్తున్నారు. తెనాలిలోని వైకుంఠపురం దేవాలయంలో మహా యాగం చేశారు.

ఈ కార్యకమంలో పాల్గొని ధార్మిక విధులు నిర్వర్తించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. లడ్డూ తయారీలో కల్తీని కలలో కూడా ఊహించలేము. ఈ ఘటనపై ప్రతి ఒక్కరిలో వేదన ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలియచేయడం అందరి బాధ్యత. దైవానికి ఎవరి వల్ల అపచారం జరిగినా… అపచారం చేసినవారికి ఆ పశ్చాత్తాప భావన లేకపోయినా లోక క్షేమం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని పవన్ కళ్యాణ్ సంకల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు, శ్రేణులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి” అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News