వంద రోజుల పాలన శాంపిల్ మాత్రమే అని టిడిపి కూటమి ప్రభుత్వం రానున్న నాలుగు సంవత్సరాల పైచిలుకు పాలనలో మరెన్నో అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరుస్తామని సోమవారం నాడు వంద రోజుల పాలన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని బిలకల గూడూరు గ్రామంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా టిడిపి క్యాడర్ మొత్తం ఎమ్మెల్యేను ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిలకలు గూడూరు గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం కోసం 22 లక్షలతో భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వందరోజుల పాలనలో అభివృద్ధి నిధులు అనే అంశంపై ఆధారపడి పాలన కొనసాగినట్టు గత వైసిపి ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసి కొత్త ప్రభుత్వానికి సున్నా నిధులు ఇచ్చి వెళ్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్రం సహకారంతో నియోజక వర్గంలో ఓర్వకల్ మెగా హబ్ సాధించుకున్నామని దీంతో యువత ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
వచ్చే వర్షకాలం కల్లా అలగనూరు రిజర్వాయర్లో నీటిని నిలుపుతామని ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని నిధులు సాధించుకుంటామని ఆరు నూరైనా వచ్చే వర్షాకాలం కల్లా రైతులకు అందుబాటులో అలగనూరు రిజర్వాయర్ నీటితో నింపుతామన్నారు. అలాగే సమస్యలపై తాను నిరంతరం కృషి చేస్తున్నట్టు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నానని పేద ప్రజల కోసంఅన్న క్యాంటీన్లు ప్రారంభించామని.పెంచిన పింఛన్లు పంపిణీ చేశామని ల్యాండ్ టైటిల్ యాక్టు రద్దు చేశామని . దీపావళి నుండి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అలాగే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై విధివిధానాలు రూపొందిస్తున్నామని ,ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని వైకాపా ప్రభుత్వం విధ్వంస పాలన చేసిందని. ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా వదలలేదని ఆదాయం తప్పితే మంచి చేసే ఆలోచన లేని వైసిపి నాయకులకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి బుద్ధి చెబుతారని అన్నారు.
నియోజకవర్గంలో కబ్జాల పర్వం కొనసాగిందని ప్రజలు తగిన బుద్ధి చెప్పారని. తనను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి అవకాశం ఇచ్చారని. మంచి అధికారులను నియమించుకొని గ్రామాలను అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు. రానున్న రోజుల్లో రోడ్లు రవాణా వ్యవసాయానికి విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు పేద ప్రజల పక్షాన టిడిపి కూటమి పనిచేస్తుందని దౌర్జన్యం చేసే నాయకులు లేరని ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉన్నారని 100 రోజుల పాలన పై ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారన్నారు..
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి. మాజీ ఎంపీపీ వంగాల శ్రీనివాస్ రెడ్డి. ఎస్ఏ రఫీక్. పంట రామచంద్రారెడ్డి. కృష్ణ యాదవ్. జయప్రకాశ్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి. జయంత్ రెడ్డి. ఎస్ఏ ఫారుక్. భోదనం విజయభాస్కర్. పంట దిలీప్ కుమార్. ఎస్ ఏ ఖలీద్. ఎస్ వలి. చిందుకూరు అనసూయమ్మ. ఎంపీడీవో ఏ శ్రీనివాసరావు. తాసిల్దార్ బి ఎన్ విద్యాసాగర్. అన్ని శాఖల అధికారులు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు