Tuesday, September 24, 2024
HomeతెలంగాణRamadugu: ఎమ్మెల్యే అంకుల్ మారోడ్డు బాగుచెయ్యరా..

Ramadugu: ఎమ్మెల్యే అంకుల్ మారోడ్డు బాగుచెయ్యరా..

స్కూల్ విద్యార్థుల అభ్యర్థన..

ఎమ్మెల్యే అంకుల్ మా రోడ్డు బాగు చేయాలని స్కూల్, కాలేజ్ విద్యార్థులు చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంను పత్రికా ముఖంగా వేడుకుంటున్నారు.

- Advertisement -

వివరాల్లోకి వెళితే… ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రామడుగు మండలంలోని గుండి గ్రామ చెరువు మత్తడి పోయడంతో గుండి నుండి లక్ష్మీపూర్ , దత్తోజిపేట, చొప్పదండి, కరీంనగర్ వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. లక్ష్మీపూర్, వెంకట్రావుపల్లి, దత్తోజిపేట వివిధ గ్రామాల నుండి గోపాలరావుపేటలోని వివిధ స్కూళ్లకు బస్సుల ద్వారా వచ్చే విద్యార్థులు అరచేతిలో ప్రాణం పెట్టుకుని వస్తున్నామని మాకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మా ప్రాణాలు గాలిలో కలిసి పోతాయని మీరు మనసున్న మారాజని మొన్న భారీ వర్షాలకు రామడుగు మండల కేంద్రంలో పాత బ్రిడ్జి కొట్టుకుపోతే వానను కూడా లెక్కచేయకుండా నూతన బ్రిడ్జిని ప్రారంభించిన ఘనత మీదనీ ఈ రోడ్డును కూడా మరమ్మత్తులు చేయించి మాకు ప్రాణ భిక్ష ప్రసాదించాలని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంను వివిధ స్కూళ్ల విద్యార్థులు వేడుకుంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News