Saturday, November 23, 2024
HomeతెలంగాణTelangana DGP: రిసెప్షనిస్టుల చేతుల్లో ఖాకీల ప్రతిష్ఠ

Telangana DGP: రిసెప్షనిస్టుల చేతుల్లో ఖాకీల ప్రతిష్ఠ

పోలీస్ శాఖ మొత్తం ఇమేజ్ పోలీస్ స్టేషన్లలోని రిసెప్షన్ ఆఫీసర్ పై ఆధారపడి ఉన్నందున, పోలీస్ స్టేషన్ కు వచ్చే పిటీషనర్ల సమస్యలను ఓపికతో విని వారికి తగు న్యాయం లభింస్తుందన్ననమ్మకాన్ని రిసెప్షన్ ఆఫీసర్ లు కల్పించాలని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ ఆఫీసర్ స్టాఫ్ ఫంక్షనల్ వర్టికల్స్ పై నేడు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని 736 మంది రిసెప్షన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ కార్యాలయం నుండి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్ లో సీఐడీ అడిషనల్ డీజీ మహేష్ భగవత్,అడిషనల్ ఎస్.పి సత్యనారాయణ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఏకరూప పోలీస్ సేవలు అందించడం ద్వారా, ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ అందించడం ద్వారా సత్ఫలితాలు లభిస్తాయనే ఉద్దేశ్యంతో మొత్తం 17 ఫంక్షనల్ వర్టికల్స్ ప్రవేశ పెట్టమని తెలిపారు. ఈ 17 వర్టికల్స్ లో మొట్ట మొదటిదైన రిసెప్షన్ ఆఫీసర్ వర్టికల్ అత్యంత కీలకమని అన్నారు.

- Advertisement -

సౌమ్యత, మర్యాద, ఆప్యాయత అనేవి రిసెప్షన్ అధికారికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలని, పోలీస్ స్టేషన్ కు వివిధ సమస్యలతో వచ్చే పిటీషనర్లతో మర్యాద పూర్వకంగా పలకరించి వారి సమస్యను ఓపికతో విని తగు కేసును నమోదు చేయాలని సూచించారు. పిటిషనర్లను పాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు కలిపించి తమకు న్యాయం కలుగుతుందనే భరోసాను పిటిషనర్ లో కల్పించాలని అంజనీకుమార్ స్పష్టం చేసారు. ప్రతీ పోలీస్ స్టేషన్లోని పోలీస్ అధికారులందరికీ మొత్తం 17 ఫంక్షనల్ వర్టికల్స్ లోనూ ప్రావీణ్యత కలిగి ఉండాలని పేర్కొన్నారు.

ముఖ్యంగా రాత్రి వేళల్లో వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్ లకు వచ్చే మహిళా పిటిషనర్ల పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, మహిళా పోలీస్ అధికారితోనే వారి సమస్యలు విని తగు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఫంక్షనల్ వర్టికల్ విధానం ద్వారా ప్రతి పోలీస్ అధికారి, తన విధుల పట్ల, సాధించాల్సిన ఫలితాల పట్ల స్పష్టత ఏర్పడి, నైపుణ్యంతో పనిచేసి ఉత్తమ ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుందని డీజీపీ పేర్కొన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్ పోలీస్ అధికారులకు తమ ప్రతిభ కనుగుణంగా తగు గుర్తింపు లభిస్తుందని వివరించారు.
2014 లో రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక వనరులు దేశంలోని మరే రాష్ట్రానికి అందలేదని గుర్తుచేశారు. తెలంగాణ పోలీస్ శాఖలో దాదాపు 21 వేల పోలీస్ వాహనాలున్నాయని, ఈ వాహనాల నిర్వహణ విధానం దేశంలో మరే రాష్ట్రంలో లేదని వెల్లడించారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన రిసెప్షన్ ఆఫీసర్లతో మాట్లాడి వారి అభిప్రాయాలను పొందడంతో పాటు తగు సలహాలు, సూచనలు స్వీకరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News