Friday, November 22, 2024
Homeనేషనల్Russia-Ukraine War : రష్యాకు షాకిచ్చిన ఈయూ పార్లమెంట్

Russia-Ukraine War : రష్యాకు షాకిచ్చిన ఈయూ పార్లమెంట్

రష్యా దేశం పేరు వినగానే గుర్తొచ్చేది.. ఉక్రెయిన్ పై చేసిన యుద్ధమే. ఉక్రెయిన్ దేశంపై నెలల తరబడి భీకర యుద్ధం చేస్తూనే ఉంది రష్యా. దాంతో రష్యాకు షాకిస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది యూరోపియన్ యూనియన్ పార్లమెంట్. రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంట్ లో నిర్వహించిన ఓటింగ్ కు 494 మంది మద్దతివ్వగా.. కేవలం 58 మంది మాత్రమే వ్యతిరేకించారు. మరో 44 మంది సభ్యులు ఓటు వేయలేదు.

- Advertisement -

తమ దేశ పౌరులే లక్ష్యంగా రష్యా యుద్ధం ప్రారంభించి.. ఇప్పటికీ దాడులు చేస్తోందని, రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించాలని ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ అమెరికా సహా ఇతర దేశాలకు విజ్ఞప్తి చేశారు. క్యూబా, ఉత్తర కొరియా, ఇరాన్, సిరియా దేశాలను ఉగ్రవాద ప్రోత్సాహక దేశాల జాబితాలో చేర్చిన అమెరికా.. రష్యాను మాత్రం ఆ జాబితాలో చేర్చేందుకు నిరాకరించడం గమనార్హం. యూరోపియన్ పార్లమెంట్ మాత్రం ఈ విషయంపై ఓటింగ్ నిర్వహించి రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పటికే రష్యాపై పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News