Saturday, September 28, 2024
HomeతెలంగాణKodada: ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం

Kodada: ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం

మహిళా ప్రయాణికుల సాయంతో..

కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో సూర్యాపేట నుంచి కోదాడకు వచ్చుచుండగా కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన మహిళ అలివేలు పురిటి నొప్పులతో బాధపడుచుండగా ఆర్టీసీ సిబ్బంది స్పందించి బస్సును పక్కకు ఆపి, తోటి మహిళా ప్రయాణికుల సహాయంతో ప్రసవము అయ్యేలా సహాయం చేసినారు.

- Advertisement -

ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే సిబ్బంది 108కు ఫోన్ చేసి ఆమెను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించినారు. కోదాడ డిపో మేనేజర్ తల్లి, బిడ్డ యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వెంటనే స్పందించిన బస్సు డ్రైవర్, కండక్టర్లను అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News