Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభAjay Patnaik the young music director of Tollywood: పెళ్లిళ్లలో మ్యూజికల్ ప్రోగ్రామ్స్...

Ajay Patnaik the young music director of Tollywood: పెళ్లిళ్లలో మ్యూజికల్ ప్రోగ్రామ్స్ చేసే యువకుడి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్

యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్

“బహిర్భూమి” సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు మంచి పేరు తీసుకొస్తుంది – యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్

- Advertisement -

నోయల్ , రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “బహిర్భూమి”. ఈ చిత్రాన్ని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహిస్తున్నారు. బహిర్భూమి సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. “బహిర్భూమి” సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా హైలైట్స్ తో పాటు తన కెరీర్ విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్.

  • మాది విజయనగరం. మా ఫ్యామిలీ రోషన్ బ్యాండ్ పేరుతో శుభకార్యాల్లో సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండేది. అప్పట్లో మా బ్యాండ్ కు చాలా గొప్ప పేరుండేది. పెళ్లికి రోషన్ బ్యాండ్ ఉంటే కార్డులో ఆ పేరు మెన్షన్ చేసేవారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ నాకు కజిన్ బ్రదర్. ఆయన చిత్రం సినిమాతో సంగీత దర్శకుడిగా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. మా ఇంట్లో సంగీత వాతావరణం ఉండేది. అలా నాకూ సంగీతం పట్ల ఆసక్తి ఏర్పడింది. కీ బోర్డ్ నేర్చుకున్నాను. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు అన్నయ్య ఆర్పీ పట్నాయక్ దగ్గర జాయిన్ అయ్యాను. ఆ తర్వాత మణిశర్మ గారి దగ్గర వర్క్ చేశాను. అలా చిత్ర పరిశ్రమలో నా ప్రయాణం మొదలైంది.
  • ఇప్పటిదాకా సంగీత దర్శకుడిగా 12 సినిమాలు చేశాను. కానీ నేను ఫలానా అని ఇప్పటిదాకా చెప్పుకోలేదు. కారణం ఏంటంటే నా సినిమాకు ఒక మంచి గుర్తింపు వచ్చి సంగీత దర్శకుడిగా నేను ఫేమ్ అయ్యేవరకు ఎలాంటి ప్రచారం వద్దు అనుకున్నాను. ప్రస్తుతం నేను చేసిన 13వ సినిమా “బహిర్భూమి” . ఈ చిత్రంలో సాంగ్స్ కు మంచి పేరొచ్చింది. వ్యూస్ బాగా వస్తున్నాయి. ఈ సినిమా నాకు సంగీత దర్శకుడిగా పేరు తెస్తుందని బలంగా నమ్ముతున్నాను.
  • “బహిర్భూమి” సినిమాలో హీరో నోయెల్ కు నత్తి ఉంటుంది. నత్తితోనే ఒక పాట కంపోజ్ చేశాం. ఇలాంటి ప్రయత్నం ఇప్పటిదాకా ఏ భాషలోని పాటకూ చేయలేదు. నోయెల్ మంచి నటుడే కాదు మంచి సింగర్ కూడా. తను ర్యాప్ పాడాడు. నేను కంపోజ్ చేసిన ప్రతి సాంగ్ ను డైరెక్టర్ తో పాటు నోయెల్ కు కూడా వినిపించేవాడిని. వాళ్లకు సాంగ్స్ బాగా నచ్చాయి.
  • “బహిర్భూమి” సినిమాను ఒక ఆడియెన్ గా చూసి చెబుతున్నా. మూవీ చాలా బాగుంటుంది. ఒక కొత్త తరహా కంటెంట్ ను మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్ రెండూ కలిపి రూపొందించారు దర్శకుడు రాంప్రసాద్. ప్రొడ్యూసర్ వేణుమాధవ్ గారికి మూవీ మేకింగ్ మీద చాలా ప్యాషన్ ఉంది. అలాగే నా ఫ్రెండ్ ప్రవీణ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. అతను కూడా నాలాగే టాలెంట్ ఉన్నా ఒక మంచి మూవీ కోసం ఎదురుచూస్తున్నాడు.
  • సినిమాలతో పాటు జింగిల్స్ కు మ్యూజిక్ చేశాను. ప్రైవేట్ సాంగ్స్ చేయడం ప్రారంభించా. టిప్స్ ఆడియో వాళ్లు దసరా స్పెషల్ సాంగ్ ఒకటి చేయమని అడిగారు. వాళ్లకు ఆ పాట చేస్తున్నా. సంగీత దర్శకుడిగా నాకు ఏఆర్ రెహమాన్ అంటే చాలా ఇష్టం. ఆయన రోజా సినిమా రిలీజ్ టైమ్ కు నాకు 8 ఏళ్లు. రోజా పాటలన్నీ పాడేవాడిని. ఆయనను ఒకసారి కలిసే అవకాశం వచ్చింది. సింగర్ కృష్ణ పాటలను ఇష్టపడతా.
  • సంగీత దర్శకుడిగా మా అన్నయ్య సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆయన ప్రభావం నా మీద పడకుండా జాగ్రత్తగా ట్యూన్స్ చేస్తుంటా. గతంలో ఓ సినిమాలో పాటకు ఆర్పీ గారే తమ్ముడికి సాంగ్ చేసి ఇచ్చారేమో అని కామెంట్ చేశారు. అయితే మనకు ఇష్టమైన పాటలన్నీ వింటూ పెరిగిన క్రమంలో మనకు తెలియకుండానే ఆ స్ఫూర్తి కలుగుతుందేమో తెలియదు. కానీ నాకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకునేలా మ్యూజిక్ చేయాలనేది నా కోరిక.
  • ప్రస్తుతం “బహిర్భూమి” సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఈ సినిమాకు మ్యూజిక్ చేస్తున్న క్రమంలోనే మరో మూడు చిత్రాలకు అవకాశాలు వచ్చాయి. అవన్నీ లవ్, ఎంటర్ టైన్ మెంట్ మూవీస్. నాకు స్వతహాగా లవ్ మూవీస్ కు మ్యూజిక్ ఇవ్వడం అంటే ఇష్టం. నా కొత్త సినిమాల వివరాలు త్వరలో వెల్లడిస్తా.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News