గ్రామీణ పోషకాహార లోపం నిర్మూలించడమే తమ లక్ష్యమని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సీఈఓ అరుణ్ మిశ్రా ప్రకటించారు. అందుకోసం రాజస్థానులోని ఉదయ్ పూర్ లో జింక్ సిటీ హాఫ్ మారథాన్ నిర్వహించామన్నారు. తద్వారా గ్రామీణ పోషకాహార లోపం నిర్మూలనపై తమ వంతుగా అవగాహన కల్పించే ప్రయత్నం చేశామన్నారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఉదయ్ పూర్ లోని మహారాణా ప్రతాప్ స్మారక్ నుంచి నీముచ్ మాతా మందిర్ కొండ, ఫతేసాగర్ సరస్సు గుండా సాగిన హాఫ్ మారథానులో వేలాది మంది పాల్గొన్నారన్నారు. 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5కిలో మీటర్ల విభాగంలో మారథాన్ విజయవంతంగా జరిగిందన్నారు. పురుషుల విభాగంలో తీవ్రంగా పోటీపడిన 21 కిలోమీటర్ల ఛాలెంజ్లో రాజస్థాన్లోని టోంక్ జిల్లాకు చెందిన రోహిత్ బన్సీవాల్ గెలుపొందగా, విక్టర్ కుర్గత్ మొదటి రన్నరప్ స్థానాన్ని, గోపాల్ బైర్వా రెండో రన్నరప్ స్థానాన్ని పొందారన్నారు.మహిళా విభాగంలో ఢిల్లీకి చెందిన మదీనా పాల్ గెలుపొందగా, సోనాల్ సుఖ్వాల్ ఫస్ట్ రన్నరప్,ఖుషీ పహ్వా సెకండ్ రన్నరప్ గా నిలిచారన్నారు. పురుషుల విభాగంలో 10 కిలోమీటర్ల ఛాలెంజ్లో రాజస్థానులోని జుంజునుకు చెందిన అజిత్ కుమార్ గెలుపొందగా,గణపత్ సింగ్ మొదటి రన్నప్,దుర్గేంద్ర సెకండ్ రన్నరప్ గా నిలిచారని తెలిపారు.మహిళా విభాగంలో రాజస్థాన్లోని దిద్వానాకు చెందిన ఖుష్బూ అగ్రస్థానంలో నిలవగా,సప్నా కుమారి ఫస్ట్ రన్నరప్,సునీతా గుర్దార్ రెండో రన్నరప్ అయ్యారన్నారు.ప్రతి ఫినిషరుకు హిందూస్థాన్ జింక్ ఉత్పత్తి చేసిన అత్యుత్తమ జింకుతో తయారు చేసిన పతకాన్ని అందించినట్లు తెలిపారు.ఈ మారథాన్ పోటీలకు ఉదయ్ పూర్ ఎంపీ మన్నాలాల్ రావత్,ఉదయ్ పూర్ సిటీ ఎమ్మెల్యే తారాచంద్ జైన్,ఉదయ్ పూర్ రూరల్ ఎమ్మెల్యే పూల్ సింగ్ మీనా,ఉదయ్ పూర్ రేంజ్ ఐజీ రాజేశ్ మీనా,ఉదయ్ పూర్ నగర్ నిగమ్ కమిషనర్ రామ్ ప్రకాశ్,నార్త్ వెస్ట్రన్ రైల్వేస్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శశికిరణ్,ఉదయ్ పూర్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ రాహుల్ జైన్,ఉదయ్ పూర్ ఫీల్డ్ క్లబ్ గౌరవ కార్యదర్శి ఉమామారమేశ్ మన్వానీ,ఏబిసిఆర్ వ్యవస్థాపకుడు డాక్టర్ మనోజ్ సోని తదితరులు పాల్గొన్నట్లు వెల్లడించారు.