Friday, October 4, 2024
HomeతెలంగాణGarla: పల్లె దవాఖాననా పార్కింగ్ ఏరియానా?

Garla: పల్లె దవాఖాననా పార్కింగ్ ఏరియానా?

స్వార్థానికి ఆసుపత్రి..

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన పల్లెదవా ఖానా భవనం కొందరికి తమ సొంత వాహనాన్ని పార్కింగ్ చేసే స్థలంగా మారింది గార్ల మండల కేంద్రంలోని స్థానిక వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న పల్లె దవాఖానాకి నిత్యం గర్భిణీ స్త్రీలు బీపీ షుగర్ పేషెంట్లు పిల్లల టీకాల కోసం బాలింతలు పోషణ కరువైన పిల్లలు ఇలా అనేక మంది వైద్య చికిత్స కోసం వస్తుంటారు. కానీ కొందరు దవాఖానలోని గదిలో పార్కింగ్ చేసి రోజుల తరబడి అందులోనే ఉంచి తీయకపోవడాన్ని చూసి దవాఖానకు వచ్చే వారు రోగులకు సేవలు అందించే పల్లె దవాఖాన భవనమా లేక సొంత వాహనాలను నిలుపుదల చేసే పార్కింగ్ స్థలమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

దవాఖాన ప్రాంగణం మొత్తం చెట్లతో నిండి ఉండగా దవాఖాన గదిలోనే రోజుల తరబడి సొంత వాహనాన్ని పార్కింగ్ చేయడం ఏందంటూ దవఖానకు వచ్చేవారు పలుమార్లు ఫిర్యాదు చేస్తున్నా అందులో పనిచేసే ఇతర వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News