Saturday, October 5, 2024
Homeట్రేడింగ్Mangalagauri Grandier launches Navaratri Kanchipattu special 9 sarees: జూబ్లీహిల్స్ మంగళగౌరి గ్రాండియర్...

Mangalagauri Grandier launches Navaratri Kanchipattu special 9 sarees: జూబ్లీహిల్స్ మంగళగౌరి గ్రాండియర్ బ్రాంచ్ లో కనువిందు చేస్తున్న నవరాత్రి కంచిపట్టు స్పెషల్ చీరలు

నవరాత్రుల స్పెషల్ యునిక్ సిల్క్స్..

తొమ్మిది రంగులు, తొమ్మిది డిజైన్లతో జూబ్లీ హిల్స్ మంగళ గౌరీ గ్రాండియర్ బ్రాంచ్ లో కనువిందు చేస్తున్నాయి నవరాత్రి పట్టు చీరలు.  ఆదిపరాశక్తి ధర్మ పరిరక్షణ కోసం తొమ్మిది రూపాలు ధరించిన అమ్మవారి అవతారాలకు ప్రతీకలుగా నవరాత్రుల్లో పూజలు అందుకుంటోంది. అమ్మవారి ఈ పురాణ గాథను ఆధారం చేసుకుని జూబ్లీ హిల్స్ మంగళ గౌరీ గ్రాండియర్ అధినేతలు దేవీ నవరాత్రుల సందర్భంగా సరికొత్త ప్రయోగాన్ని చేశారు. 

- Advertisement -

9 రంగులు, 9 నెలలు, 9 డిజైన్లు..

నవరాత్రి పూజల ప్రత్యేకతలు ప్రతిబింబిస్తూ బంగారం, వెండి, రాగి తీగలతో కూడిన డిజైన్లో నవరాత్రుల ప్రత్యేక రంగులైన తెలుపు, ఎరుపు, గాఢ నీలం, పసుపు, బాటిల్ గ్రీన్, గ్రే, లేత నీలం, ఆరంజ్, పింక్ రంగుల్లో ప్రత్యేక చీరలు సిద్ధం చేయించి కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చే వినూత్న ప్రయత్నం ఆశ్చర్యగొలుపుతోంది.  అత్యంత విశిష్టంగా ఉండేలా ఈ 9 రకాలు పట్టు చీరలను 9 ప్రత్యేకమైన డిజైన్లలో 9 నెలల కాలంలో దేశంలోని వివిధ ప్రదేశాలకు చెందిన చేనేత కళాకారులతో రూపకల్పన చేయించి వాటిని తమ షోరూముల్లో ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చారు.

పండుగలు వేడుకగా జరుపుకునేందుకు..

విజయ దశమి, దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా అమ్మవారికి చేసే పూజల్లో వీటిని ఉపయోగించి దశమినాడు అమ్మవారి ఆశిస్సులు ఘనంగా అందుకోవాలని మంగళ గౌరి గ్రాండియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ కృష్ణమూర్తి వస్త్రప్రియులను కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News