Saturday, November 23, 2024
HomeNewsSpecial focus on cleanliness: పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి: కమీషనర్ ఆమ్రపాలి

Special focus on cleanliness: పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి: కమీషనర్ ఆమ్రపాలి

ఎలాంటి ఇబ్బందులు రావద్దు..

పారిశుద్ధ్య నిర్వహణ పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని జిహెచ్ఎంసి కమీషనర్ ఆమ్రపాలి కాట సంబంధిత అధికారులను ఆదేశించారు.   చార్మినార్ జోన్ లోని అత్తాపూర్, రాజేంద్రనగర్, ఆరాంఘర్, మీర్ ఆలం ట్యాంక్, బహదూర్ పుర తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, స్థితి గతులను పరిశీలించి అధికారులకు ఆదేశించారు. 

- Advertisement -

వల్నరబుల్ పాయింట్ లను తొలగించండి..

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… పారిశుద్ధ్య నిర్వహణ సజావుగా జరగాలని, ఈ విషయంలో ప్రజలకు పరిశుభ్రత పాటించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్వచ్ఛ ఆటోల కదలికలను, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేలా పర్యవేక్షించాలని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ లను తొలగించాలని, సి అండ్ డి వేస్ట్ ను ప్రత్యేక వాహనాల ద్వారా తరలించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

దోమల నియంత్రణకు యాంటీ లార్వా ఆపరేషన్స్, ఫాగింగ్ తదితరాలను చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రోడ్ల పై ఏర్పడిన గుంతలను పూడ్చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ కమర్షియల్ స్ట్రెచెస్ లో వ్యర్థాలు వెంటనే తీసుకొని పోయే విధంగా చర్యలు తీసుకోవాలని రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ రవి కుమార్ ను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News