Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: కేసుల పరిష్కారంలో పరిపాలన అధికారులు

Karimnagar: కేసుల పరిష్కారంలో పరిపాలన అధికారులు

వివిధ రకాల కేసుల పరిష్కారంలో పోలీస్ స్టేషన్లకు చెందిన పరిపాలన అధికారులు ఎస్ హెచ్ఓలకు సహాయకారులుగా ఉండాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు అన్నారు. కమిషనరేట్ లోని వివిధ పోలీస్ స్టేషన్లలో పరిపాలన అధికారులుగా పనిచేస్తున్న పోలీసులు ఎస్ హెచ్ఓ లతో సమానమైన విధినిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాలన్నారు.

కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో వివిధ పోలీస్ స్టేషన్లలో పరిపాలన అధికారులుగా (ఏఓ) పనిచేస్తున్న వివిధ స్థాయిలకు చెందిన పోలీసులకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఎస్ హెచ్ఓ లు అందుబాటులో లేకున్నా దృష్టికి వచ్చిన సమస్యలు, ఫిర్యాదులను స్వీకరిస్తూ వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సత్వర స్పందన, వేగవంతంగా సేవలందించేందుకు వివిధ రకాల పని విభాగాల (వర్టికల్స్) ఏర్పాటులో భాగంగా ఈ పరిపాలన అధికారులు విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలీస్ స్టేషన్లలోని అన్ని విభాగాల పనితీరుపై అవగాహన ఉండాలన్నారు. వేగవంతంగా పనిచేయడం ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. కాలానికనుగుణంగా సేవల్లోనూ వినూత్న ఒరవడితో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. తమ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏదైనా నేరఛేదనకు సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే క్రైంబృందాలకు తమవంతు సహకారం అందించాలని తెలిపారు. నేరాల ఛేదనలో కీలక పాత్రపోషించే వారికి వెంటనే రివార్డులను అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి పి. కాశయ్య, ఎస్బీఐజీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News