అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడి కేసు సుమోటో గా స్వీకరించింది తెలంగాణ హైకోర్టు. GHMC అసలు ఏం చేస్తోందని ప్రశ్నించిన హైకోర్టు మీ నిర్లక్ష్యం తో పసి బాలుడు చనిపోయాడంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకుంటున్నచర్యలేంటని కోర్టు నిలదీసింది. తెలంగాణ చీఫ్ సెక్రటరీ, GHMC, హైదరాబాద్ కలెక్టర్, తెలంగాణ లీగల్ సేల్ అథారిటీ, అంబర్ పేట్ మున్సిపల్ అధికారికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బాలుడు మృతి బాధాకరమన్న హైకోర్టు, బాలుడు మృతికి నష్ట పరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు.. తదుపరి విచారణ మార్చ్ 16 వాయిదా వేసింది.
High court: సుమోటోగా వీధికుక్కల దాడి కేసు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES