Monday, October 14, 2024
Homeఆంధ్రప్రదేశ్Rain alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Rain alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో..

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. ఇది రాగల 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులే అవకాశం

- Advertisement -

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదు

నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం

నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

బుధ,గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం

భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు ,కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలి

బయట ఉన్నట్లయితే ఒరిగిన విద్యుత్ స్థంబాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ క్రింద ఉండరాదు

పాత బిల్డింగ్స్ వదిలి సురక్షిత భవనాల్లో ఉండాలి

వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం

పొలాల్లో పనిచేసే రైతులు,కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు.

~ రోణంకి కూర్మనాథ్,ఎండి, విపత్తుల నిర్వహణ సంస్థ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News