Monday, October 21, 2024
Homeకెరీర్Telangana Public Service Commission Group1 Exams: కాసేపట్లో గ్రూప్1 పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో...

Telangana Public Service Commission Group1 Exams: కాసేపట్లో గ్రూప్1 పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

TG Group1 Exams: కాసేపట్లో తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్1 పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు పరీక్ష ప్రారంభమై ఐదు గంటల వరకు జరుగుతుంది. పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు..

మరోవైపు పరీక్షలు వాయిదా వేయాలని కొంతమంది అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండటంతో పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఒక్కో కేంద్రంలో ఎస్సై ఆధ్వర్యంలో దాదాపు 20 మంది పోలీసులు భద్రత పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాలోనే మొత్తం పరీక్ష కేంద్రంలోని ప్రతి గది ఉంటుంది. ఈ సీసీ కెమెరాలను టీజీపీఎస్సీ(TGSPC) కార్యాలయానికి అనుసంధానించారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక మెడిల్‌ సదుపాయం కల్పించడంతో పాటు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటుచేశారు.

563 పోస్టులకు 31,383 మంది అభ్యర్థులు..

రాష్ట్రవ్యాప్తంగా 46 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం 563 పోస్టుల కోసం 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. అయితే 12.30 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతి ఇస్తారు. దాదాపు గంట పాటు వివిధ తనిఖీలు చేసిన తర్వాత అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి వెళ్లనిస్తారు. మొదటి రోజు చూపించిన హాల్‌టికెట్‌ను మాత్రమే అన్ని పరీక్షలకు ఉపయోగించాల్సి ఉంటుంది.

పరీక్ష రాసే అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

✏ అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డు వెంట తీసుకురావాలి.
✏ బ్లాక్ లేదా, బ్లూ రంగు బాల్‌పాయింట్ పెన్నుతోనే పరీక్షరాయాలి.
✏ పెన్నులతో పాటు బొమ్మలు వేయడానికి స్కేల్, పెన్సిల్, ఎరైజర్‌, షార్ప్‌నర్‌ తెచ్చుకోవాలి.
✏ అభ్యర్థులకు ఒకే బుక్‌లెట్‌ ఇస్తారు. అందులోనే మొత్తం ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
✏ ఇంగ్లీష్‌ మినహా మిగతా పరీక్షలకు ఏ భాషలో అయినా సమాధానాలు రాసుకోవచ్చు. అయితే అన్ని పరీక్షలకు ఒకే భాషను ఎంచుకోవాలి.
✏ దివ్యాంగుల కోసం స్క్రైబ్‌ సెలెక్ట్ చేసుకుంటే వారి కోసం ప్రత్యేక పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఏ రోజు ఏ పరీక్ష అంటే…

21.10.2024: జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్)
22.10.2024: పేపర్-1 (జనరల్ ఎస్సే)
23.10.2024: పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)
24.10.2024: పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్)
25.10.2024: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్)
26.10.2024: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్)
27.10.2024: పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతరణ)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News