వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గుంతబస్ పల్లి గ్రామ పరిధిలో ఉన్న జిప్సం కంపెనీ నుంచి వచ్చే విషపూరితమైన కెమికల్స్ వ్యర్థాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గత కొన్ని నెలలుగా రైతులు గతంలో ఆందోళనకు దిగారు. ఈ కంపెనీ కొనసాగడంతో రైతుల వందలాది ఎకరాల వ్యవసాయ భూములు బీడువారి పోతున్నాయని రైతులు ఆందోళనలు చేశారు. ఇలాంటి కంపెనీలు కొనసాగిస్తే ప్రజల ఆరోగ్యాలు ఏమవుతాయని ప్రశ్నించారు. ఇష్టరాజ్యంగా కొనసాగిస్తున్న జిప్సం కంపెనీలు మూసి వేయకపోతే ముందుముందు ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కొన్ని రోజుల క్రిందట హెచ్చరించారు. ఇదిలావుండగా జిప్సం ఫ్యాక్టరీలో సల్ఫర్ యాసిడ్ సిలిండర్లు పేలుడు వల్ల అగ్నిప్రమాదం చోటుచేసుకుంది . ఫ్యాక్టరీలో ఎవరికి ప్రాణనష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.
Tanduru: జిప్సం ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES