Friday, November 22, 2024
Homeనేషనల్China: సరిహద్దుల్లో 'జైశ్రీరామ్' నినాదాలు చేసిన చైనా సైనికులు

China: సరిహద్దుల్లో ‘జైశ్రీరామ్’ నినాదాలు చేసిన చైనా సైనికులు

China| భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ఇటీవల కొత్త చొరవ తీసుకున్నారు. భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఎల్‌ఏసీలో పెట్రోలింగ్‌కు సంబంధించి ఒప్పందం కుదిరిందని అక్టోబర్ 21న భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీని కింద సరిహద్దుల్లో దీర్ఘకాలంగా ఉన్న ఇరుదేశాల సైనికుల అదనపు మోహరింపు తొలగించబడుతుంది. గాల్వాన్ లోయలో ఇరువైపులా సైనికుల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న తర్వాత ఈ మోహరింపు జరిగింది. ఇప్పుడు ఈ అదనపు సైన్యం ఉపసంహరించుకోనుంది.

- Advertisement -

ఇటీవల సరిహద్దు తీర్మానం తర్వాత చైనా సైనికుల చేత భారత సైనికులు జైశ్రీరామ్ నినాదాలు చేయించారని చెబుతున్నారు. బీహార్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అమృతభూషణ్ ఈ వైరల్ వీడియోను ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేశారు. సరిహద్దు తీర్మానం తర్వాత భారత సైనికులు చైనా సైనికుల చేత జైశ్రీరామ్ నినాదం చేయించారంటూ రాసుకొచ్చారు. అయితే ఈ వీడియో 10 నెలల కిందటి వీడియో అని తేలింది.

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవరం సందర్భంగా జనవరి 22, 2024న చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) భారత సైనికులతో కలిసి బ్రేక్‌ ఫాస్ట్ మీట్ చేశారు. ఈ సందర్భంగా చైనా సైనికులు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(LAC)లో ఉన్న సరిహద్దు ప్రాంతమైన చుమర్‌కి సంబంధించింది. కాగా ఈ చోక్సీ లేహ్ నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News