Friday, April 4, 2025
HomeఆటArchery academy: ఆర్చరీ అకాడమీ పిల్లలకు స్వర్ణ పతకాలు

Archery academy: ఆర్చరీ అకాడమీ పిల్లలకు స్వర్ణ పతకాలు

విలువైన విలు విద్య..

సైదాబాద్ బాలసదన్ లోని ఆర్చరీ అకాడమీకి చెందిన స్వర్ణ పతకాల విజేతలకు మంత్రి సీతక్క ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్ జిల్లా విలు విద్య ఛాంపియన్షిప్ లో రూబెన్ కి స్వర్ణం లభించగా,రంగారెడ్డి జిల్లా విలువిద్య ఛాంపియన్షిప్ లో అశోక్ కి స్వర్ణం దక్కింది. ఈ మధ్య బాలసదనలో విద్యార్థులను స్వయంగా కలిసి ప్రోత్సహించారు మంత్రి సీతక్క.

- Advertisement -

బాల సదన్ విద్యార్థులకు జిల్లా స్థాయి పోటీల్లో గోల్డ్ మోడల్స్ రావడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తంచేశారు. పతక విజేతలను అభినందించిన మంత్రి సీతక్క, కరీంనగర్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News