Sunday, October 27, 2024
Homeట్రేడింగ్Trading in Telugu by TIC Academy: ట్రేడింగ్ తెలుగులో..టీఐసీ అకాడమీ స్పెషాలిటీ ఇదే

Trading in Telugu by TIC Academy: ట్రేడింగ్ తెలుగులో..టీఐసీ అకాడమీ స్పెషాలిటీ ఇదే

ట్రేడింగ్ ఇక ఈజీ..సింపుల్

పెట్టుబడులంటే ఇష్టం లేనిది ఎవరికి? కానీ ఇందుకు అవసరమైన అవగాహన, సమాచారం అర్థం కాక చాలామంది ట్రేడింగ్ కు దూరంగా ఉంటారు, లేదా ఉత్సాహంకొద్దీ పెట్టుబడి పెట్టినా సరైన అవగాహన లేక నష్టపోతుంటారు. ఇలాంటి సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు ది ఇన్వెస్టర్ కో (టిఐసి) అనే సంస్థ మొట్టమొదటిసారి తెలుగులో ట్రేడింగ్ పై అవగాహన కల్పించేందుకు కృషిచేస్తోంది. ఇందులో భాగంగా టీఐసి సంస్థ తెలుగులో ట్రేడింగ్ కోర్సులను వివిధ విభాగాల్లో సిద్ధంచేసింది. అన్ని వయసులవారు మార్కెట్లపై అవగాహన పెంచుకునేందుకు అవసరమైన రీతిలో ఈ అకాడమీ శిక్షణ ఇవ్వనుండటం విశేషం.

- Advertisement -

తెలుగులో తొలిసారి..

ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి అకాడమిక్ కోర్సులు ప్రారంభించిన సంస్థలు ఏవీ లేవు. పైగా మహిళలు, విద్యార్థులు, అన్ని వయసుల వారు కూడా ఈ అకాడమీ ద్వారా మార్కెట్లపై పట్టు పెంచుకుని, సురక్షితమైన పెట్టుబడులు పెడుతూ, లాభాలు ఆర్జించేలా ట్రైనింగ్ పొందే అవకాశం మన హైదరాబాద్ నగరంలోనే లభిస్తుండటం విశేషం.

హిమాయత్ నగర్లోనే..

  • ఫైనాన్షియల్ మార్కెట్ లో పురోగమనానికి దిక్సూచిగా వ్యవహరించేందుకు ది ఇన్వెస్టర్ కో (TIC) నగరంలోని టిఐసి అకాడమీ హిమాయత్ నగర్ లోని, హార్మనీ ప్లాజా, 5వ అంతస్తులో టిఐసి వ్యవస్థాపకులు రక్షత్ గోయల్, టిఐసి మాస్టర్ ఫ్రాంచైజీ నిర్వహకులు విశ్వనాథ్ సామా, అకాడమీ ఫ్రాంచైసీ నిర్వహకులు సంజయ్ దోల్వానీతో కలిసి ప్రారంభించారు.

భారతదేశం అత్యధిక జనాభా గల దేశంగా ఉండచ్చు కానీ ఫైనాన్షియల్ మార్కెట్లలో మనవాటా ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇటీవల కాలంలో మార్కెట్లపై ఆసక్తిచూపుతన్న వారి సంఖ్య బాగా పెరిగినప్పటికీ అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి ప్రారంభించాలో వారికి తెలియడం లేదు. పెట్టుబడుల చుట్టూ అలుముకున్న ఈ అయోమయాన్ని తొలగించి విశాలమైన ఆర్థిక మార్కెట్లలో ప్రవేశించడానికి ముందు ఒక పటిష్టమైన తొలి అడుగు వేయడానికి టిఐసి సహాయపడుతుంది.
ట్రేడింగ్ నేర్చుకోవడానికి, ప్రాక్టీసు చేయడానికి, సంపాదించుకోవడానికి తద్వారా ఇండియాలో యాక్టివ్ ట్రేడర్ల పరిమాణం పెంచడానికి ది ఇన్వెస్టర్ కంపెనీ ద్వారా సాధ్యమవుతుంది. ఫైనాన్షియల్ మార్కెట్లలో ప్రతి వ్యక్తికి నాలెడ్జి, స్కిల్స్, మార్కెట్లలో సంక్లిష్టతలను అధిగమించి విశ్వాసాన్ని, విజయాన్ని సాధించడానికి దారి చూపేలా వీరు మనకు గైడ్డ చేస్తారు.

వ్యవస్థాపకుల గురించి:
టిఐసి అద్భుతమైన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ స్టార్టప్. ఇది టెక్స్ట్ బుక్ నాలెడ్జికి, ప్రాక్టికల్ అప్లికేషన్కు మధ్య అగాధాన్ని తొలగిస్తుంది. వాళ్ళకి ఉన్న ఫైనాన్స్ నాలెడ్జితో నష్టం కలిగించని ఎంటర్ ప్రెన్యూర్షిప్ను పెంపొందిస్తుంది. సత్వర నిర్ణయాలు తీసుకోవడం, వెంటనే అమలు చేయడం గురించి తెలుసుకుంటారు. వారు సవాళ్లను గుర్తించి పరిష్కారం చేయడంలో సమయము వృధా కాకుండా చేస్తారు. అయితే వీరికున్న నాయకత్వ శైలితో ఎంతో మందిని డైనమిక్ సిబ్బందిగా తయారు చేసుకున్నారు. స్టాక్ మార్కెట్లో సామాన్య ప్రజలు ఎలా పెట్టుబడి పెట్టుకోవాలో తెలుసుకోడానికి, ప్రాక్టీసు చేసుకోడానికి, స్టాక్ మార్కెట్లో విజయం సాధించడానికి టిఐసి సహకరిస్తుంది. టిఐసి మొదటి ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీని దుబైలో ప్రారంభించబోతోంది. ఇది ఈ కంపెనీ గ్లోబల్ విస్తరణలో ప్రధానమైన తొలి అడుగు.

రియల్ టైమ్ మార్కెట్ డేటాతో..

తమ విద్యార్థులు వర్చువల్ క్యాపిటల్ను ఉపయోగించి రియల్ టైమ్ మార్కెట్ డేటాను ఉపయోగించి ట్రేడింగ్ చేసేలా అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారన్నమాట. దీనివల్ల వారికి ఆర్ధిక నష్టం లేక పోయినా మంచి అనుభవం వస్తుంది. విద్యార్ధులు తమ డబ్బు కోల్పోకుండా నిజమైన మార్కెట్ పరిస్థితులను పరిశీలించుకునే నైపుణ్యాలను పెంచుకుని మార్కెట్ల నుంచి నిజమైన లాభాలను పొందే అవకాశము పొందుతారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News