Friday, November 22, 2024
Homeట్రేడింగ్Best treatment for Brian stroke in Yashoda: 'వరల్డ్ స్ట్రోక్ డే' సందర్భంగా...

Best treatment for Brian stroke in Yashoda: ‘వరల్డ్ స్ట్రోక్ డే’ సందర్భంగా పక్షవాతంపై అవగాహన

గోల్డెన్ అవర్ చాలా ఇంపార్టెంట్..

‘వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే’ సందర్భంగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బ్రెయిన్ స్ట్రోక్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్లలో కొత్త చికిత్స విధానాలు, అందుబాటులోకి వచ్చిన సాంకేతికతలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.

- Advertisement -

పక్షవాతం (బ్రెయిన్ స్ట్రోక్) అనేది మనిషిని తెలియకుండానే కుంగదీసే ప్రమాదకరమైన వ్యాధి. అప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించే వ్యక్తిని అకస్మాత్తుగా వికలాంగుడిగా మారుస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో పక్షవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మద్యం, పొగ తాగడం, దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యల వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి వయసు పెరిగే కొద్దీ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరని, బ్రెయిన్ స్ట్రోక్ పట్ల అందరిలో మరింత అవగాహన రావడం ఎంతో అవసరమని, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రమేష్ మస్తీపురం అన్నారు.

మెకానికల్ థ్రోంబెక్టమీతో వండర్స్..

ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్, డా. పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. బ్రెయిన్ స్ట్రోక్ అత్యాధునిక చికిత్సా విధానం “మెకానికల్ థ్రోంబెక్టమీ” అనే కొత్త చికిత్సా సాంకేతికత చాలా మంది రోగులను వైకల్యం, ప్రాణాపాయం నుండి కాపాడటంలో యశోద ముందంజలో ఉంది. “మెకానికల్ థ్రోంబెక్టమీ” చికిత్స విధానంతో తిరిగి మామూలు జీవితం గపవచ్చన్నారు. ఈ చికిత్స బ్రెయిన్ స్ట్రోక్ ప్రారంభ లక్షణాల తర్వాత 24 గంటలలోపు చేయవచ్చని డా.పవన్ గోరుకంటి చెప్పారు.

తక్షణం ఆసుపత్రికి వెళ్తే చాలు..
యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్. ఆర్. ఎన్. కోమల్ కుమార్ మాట్లాడుతూ.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తరువాత రక్త నాళాలను తిరిగి తెరవడానికి రెండు చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ముందుగా థ్రోంబోలిసిస్ ఇంజెక్షన్: ఇది పక్షవాతం ప్రారంభమైన 4-5 గంటల వరకు ఉపయోగపడుతుంది. రెండవది థ్రోంబెక్టమీ – పక్షవాతం వచ్చిన 24 గంటల వరకు చేయగలిగేది, ఇది స్టెంట్ ద్వారా రక్తనాళంలో రక్తప్రసరణకు అడ్డుగా ఉన్న దానిని తొలగించే పద్ధతి. పక్షవాతం వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లగలిగితే, పక్షవాతం వచ్చినా యధావిధిగా జీవించగలుగుతారు. వైద్యరంగంలో అత్యుత్తమ వైద్య సేవలను అందించడంలో ఎప్పుడూ ముందుండే యశోద హాస్పిటల్స్, DTAS (డైరెక్ట్ టు యాంజియో సూట్)తో “బై-ప్లేన్ న్యూరో యాంజియో ప్రొసీజర్ సూట్” అనే అత్యాధునిక సాంకేతికతను ప్రారంభించి రోగుల ప్రాణాలు కాపాడుతోంది. అమూల్యమైన గోల్డెన్ అవర్ సమయంలో, రోగికి సమయం వృథా కాకుండా థ్రాంబోలైసిస్ , ధ్రాంబొక్టెమి చికిత్స సత్వరంగా అందిస్తారు. ఈ సూట్ అధునాతన ఇమేజింగ్ సామర్థ్యాలతో రోగి చుట్టూ 360 డిగ్రీలు కదలగలదు. బై-ప్లేన్ సిస్టమ్ అత్యంత వేగం, కచ్చితత్వంతో రోగి ప్రాణాలు కాపాడతామని సీనియర్ న్యూరాలజిస్ట్, డాక్టర్. ఆర్. ఎన్. కోమల్ కుమార్ తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News