గార్ల గ్రామానికి చెందిన గాడి పల్లి రాజేష్ తన ఫోన్ పోయిందని గార్ల పోలీస్స్టేషన్లో పిర్యాదు చేయగా సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసి ఒక్క రోజు వ్యవధిలోనే పోయిన ఫోన్ను గుర్తించి బాధితునికి ఎస్సై జీనత్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా తమ సెల్ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా అట్టి ఫోన్ వివరాలు సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
పోర్టల్ ద్వారా మొబైల్ తిరిగి పొందే అవకాశం ఉందని, దీనిని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎవరికైనా మొబైల్ఫోన్లు, ఇతర వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్స్టేషన్లో అప్పగించాలని, అంతే కాని వాటిని తమ వద్ద ఉంచుకోవడం నేరమని తెలిపారు.
Garla: ఫోన్ పోతే సీఈఐఆర్ పోర్టల్ లో ..
4 గంటల్లో దొరికిన ఫోన్ !
సంబంధిత వార్తలు | RELATED ARTICLES