Friday, November 22, 2024
Homeట్రేడింగ్Festival special trains by SCR: 850 పండుగ స్పెషల్ ట్రైన్స్

Festival special trains by SCR: 850 పండుగ స్పెషల్ ట్రైన్స్

రద్దీ-భద్రతపై ఫోకస్

దీపావళి, ఛత్ పండుగల నేపధ్యంలో ప్రయాణీకుల భారీ రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఫెస్టివల్ సీజన్ కావటంతో విపరీతంగా పెరిగిన డిమాండ్ ను తట్టుకునేలా దక్షిణ మధ్య రైల్వే 850 ప్రత్యేక రైళ్లను నడపనుంది. వీటితోపాటు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సౌకర్యవంతంగా చేరుకోవడానికి అనుకూలంగా ఇప్పటికే ఉన్న రైళ్లకు అదనపు కోచ్‌లు జోడించనున్నారు.

- Advertisement -

14 అదనపు కౌంటర్లు కూడా..
ప్రయాణికులు సాఫీగా టిక్కెట్లను తీసుకోవడానికి అనుకూలంగా ప్రధాన స్టేషన్లలో 14 అదనపు కౌంటర్లతో పాటు, డిమాండ్ ఆధారంగా అదనపు కౌంటర్ల సంఖ్య పెంచేందుకు సిద్ధమైంది. రద్దీగా ఉండే ప్రయాణ సమయాల్లో క్యూలు, రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి స్టేషన్‌లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్.పి.ఎఫ్.), టిక్కెట్ చెకింగ్ సిబ్బందిని మోహరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది.

స్పెషల్ చెకింగ్ టీమ్స్..
సికింద్రాబాద్ , హైదరాబాద్, కాచిగూడ , విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి అన్ని ప్రధాన స్టేషన్లలో హెడ్‌క్వార్టర్స్, డివిజన్ల నుండి అధికారులను నియమించి ప్రయాణీకుల రద్దీ అవసరాలను వ్యక్తిగతంగా పర్యవేక్షించడానికి, సమీక్షించడానికి చర్యలు తీసుకున్నారు. రైళ్లలోని అన్ని రిజర్వ్‌డ్ కోచ్‌లను పర్యవేక్షించడానికి తగినంత టిక్కెట్ చెకింగ్ సిబ్బందిని నియమించారు, టికెట్ లేని ప్రయాణాన్ని నిరోధించడానికి, టిక్కెట్తో ప్రయాణించే ప్రయాణీకుల సౌకర్యాన్ని నిర్ధారించడానికి ప్రత్యేక టిక్కెట్ చెకింగ్ బృందాలను ఏర్పాటు చేశారు.
ప్రయాణీకుల కొరకు స్టేషన్లలోని క్యాటరింగ్ స్టాల్ నిర్వాహకులు అదనపు డిమాండ్‌ను నిర్వహించడానికి సరిపడా ఆహార పదార్థాలను ఉంచుకోవాలని ఆదేశించారు. తగినన్ని ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సేవలు అందేలా ఐ.ఆర్.సి.టి.సి తో సమన్వయం చేస్తున్నారు.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అదనపు బలగాలతో..

ప్రయాణికుల భద్రత, రద్దీని అదుపు చేసేందుకు వీలుగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేక చర్యలు చేపట్టేలా సిద్ధమైంది. సి.సి.టి.విలో విస్తృత పర్యవేక్షణ చేస్తూ స్టేషన్లు, స్టేషన్ ప్రాంగణాలలో, ప్లాట్‌ఫారమ్‌లు, రైళ్లలో అవసరమైన బృందాలను మోహరిస్తోంది. ఆకతాయిలకు వ్యతిరేకంగా నిఘాను పెంచి, ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. ఆర్.పి.ఎఫ్. అధికారులు, పర్యవేక్షక సిబ్బందిని ఆకస్మిక తనిఖీలు నిర్వహించడానికి కూడా స్టేషన్లలో మోహరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News