Wednesday, October 30, 2024
HomeNewsNishad Yusuf: మాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 'కంగువా' మూవీ ఎడిటర్ కన్నుమూత

Nishad Yusuf: మాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ‘కంగువా’ మూవీ ఎడిటర్ కన్నుమూత

Nishad Yusuf| కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఎడిటర్ నిషాద్ యూసుఫ్(Nishad Yusuf) అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. కొచ్చిలో నివాసముంటున్న నిషాద్‌ తన అపార్ట్‌మెంట్‌లో బుధవారం ఉదయం విగతజీవిగతా పడి ఉన్నారు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనుమనాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిషాద్ ఆకస్మిక మరణంపై మాలీవుడ్‌ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘కంగువ’కు ఎడిటర్‌గా నిషాద్ పనిచేశారు. ప్రముఖ దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 14న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇటీవల తెలుగులోనూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో నిర్వహించారు మేకర్స్. అలాగే చెన్నైలో నిర్వహించిన ఆడియో లాంచ్ కార్యక్రమంలోనూ నిషాద్ పాల్గొన్నారు. ఇప్పుడు సినిమా విడుదలకు కొన్నిరోజుల ముందు ఆకస్మాత్తుగా నిషాద్ మృతి చెందడంతో కంగువ మూవీ యూనిట్‌ షాక్‌ తగిలింది.

2022లో టోవినో థామస్ హీరోగా తెరకెక్కిన ‘తల్లుమాల’ చిత్రానికి గాను నిషాద్‌ ఉత్తమ ఎడిటర్‌గా కేరళ రాష్ర్టం నుంచి అవార్డును అందుకున్నారు. ఇక మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న ‘బాజూకా’ సినిమాకు నిషాద్‌ వర్క్‌ చేస్తున్నారు. సూర్య, RJ బాలాజీ కాంబోలో వస్తున్న సినిమాకు కూడా ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిషాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News