Wednesday, October 30, 2024
Homeచిత్ర ప్రభNTR: నందమూరి వారసుడికి ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ శుభాకాంక్షలు

NTR: నందమూరి వారసుడికి ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ శుభాకాంక్షలు

NTR| సీనియర్ ఎన్టీఆర్ మునిమనవడు, నందమూరి హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్‌ కుమారుడు..తారక రామారావు హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి(YVS Chowdary) పరిచయం చేస్తున్నాడు. దీపావళి పండుగను పురస్కరించుకుని ఇవాళ హీరో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నందమూరి రామ్ బాబాయ్‌లు ఎన్టీఆర్(NTR), కళ్యాణ్‌ రామ్‌(Kalyanram)లు తమ సోదరుడి కుమారుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు.

- Advertisement -
Nandamuri

ఎన్టీఆర్ ఏమన్నారంటే.. “సినీ ఇండస్ట్రీలో మొదటి అడుగులు వేస్తున్న నీకు ఆల్ ది బెస్ట్ రామ్. సినిమా ప్రపంచం నిన్ను ఆదరించడానికి లెక్కలేనన్ని క్షణాలను అందజేస్తుంది. నీకు విజయం తప్ప మరేమీ కాదు! మీ ముత్తాత ఎన్టీఆర్, తాత హరికృష్ణ, నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో నువ్వు ఉన్నత శిఖరాలకు చేరుకుంటావన్న నమ్మకం నాకుంది. షైన్ ఆన్ మై బాయ్” అని విష్ చేశారు.

నందమూరి కళ్యాణ్ రామ్ కూడా స్పందిస్తూ.. ” నా ప్రియమైన రామ్‌కి శుభాకాంక్షలు, నువ్వు నీ తొలి సినిమాతో మా అందరినీ గర్వపడేలా చేస్తావని.. నీ సినీ కెరీర్‌లో చాలా ముందుకు వెళ్తావని ఆశిస్తున్నాను, నీకు తాత తారక రామారావు, అన్న జానకి రామ్ అశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయి. ఆల్ ది బెస్ట్ రామ్” అని శుభాకాంక్షలు తెలిపారు.

కాగా ‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ పతాకంపై వైవిఎస్ చౌదరి సతీమణి గీత ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభకానుంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News