Wednesday, October 30, 2024
HomeతెలంగాణMallapur: గ్రామాల మధ్య భూ సమస్య పరిష్కరించండి

Mallapur: గ్రామాల మధ్య భూ సమస్య పరిష్కరించండి

ఆర్డీవోకు వినతి

ప్రభుత్వ భూమి రెండు గ్రామాల మధ్య చిచ్చు రేపింది. మొగిలిపేట నడికూడ గ్రామాల మధ్య ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి ఇరు గ్రామస్తులు మాదంటే మాదంటూ గొడవపడ్డారు, గతంలో సమస్యను పరిష్కరించండని అధికారులకు తెలిపిన పట్టించుకోలేదని, వ్యవసాయ మార్కెట్ కోసం చదును చేసేందుకు మొగలిపేట గ్రామానికి చెందిన 250 మంది రైతులు ఆ స్థలానికి వెళ్లగా, విషయం తెలుసుకున్న నడి కూడ గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో ఇరు గ్రామాల మధ్య గొడవ జరిగింది.

- Advertisement -

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు గ్రామస్తులను అక్కడి నుంచి పంపించారు. తమ సమస్యకు పరిష్కార మార్గం కావాలని మొగిలిపేట గ్రామానికి చెందిన రైతులు వినతిపత్రం ఇచ్చేందుకు తహసిల్దార్ కార్యక్రమానికి వెళ్లగా అక్కడే ఉన్న ఆర్డిఓ శ్రీనివాస్ కు తమ భూమి సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. వారం రోజుల్లో స్థలానికి వచ్చి విచారణ చేసి సమస్యను పరిష్కరిస్తామని ఆర్డిఓ హామీ ఇచ్చారని మొగిలి పేట గ్రామస్తులు తెలిపారు.

ఆర్డీవోకు అభివృద్ధి పత్రం అందించిన వారిలో మొగిలిపేట విడిసి చైర్మన్ మహబూబ్ ఖాన్,వీడీసీ సభ్యులు గోల్కొండ గంగాధర్, దండవేణి నర్సయ్య, ఎదిలాపురం నరేష్ ,నడపన్న , సాయి రాం , సాయిలు , రాజారెడ్డి, లక్ష్మణ్ మొగిలిపేట రైతులు గ్రామస్తులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News