Friday, September 20, 2024
Homeహెల్త్Weight loss: ఇది తింటే బరువు మటాష్

Weight loss: ఇది తింటే బరువు మటాష్

పెరుగు, ఎండుద్రాక్ష కాంబినేషన్ రెసిపీ తింటే బరువు తగ్గుతారుట. ఇది ఇప్పటి మాట కాదు. ఎప్పటి నుంచో మన పెద్దవాళ్లు అనుసరిస్తున్న వెయిట్ లాస్ ఫుడ్ సీక్రెట్ అంటున్నారు పోషకాహారనిపుణులు. పెరుగులో ఎండుద్రాక్ష వేసుకుని తినడం వల్ల బరువు తగ్గడమే కాదు మొత్తం శరీరారోగ్యానికి కూడా ఇది సంజీవనిలా పనిచేస్తుందిట. ఈ రెసిపీని ఎవరైనా అత్యంత సులువుగా చేసుకోవచ్చు. మిడ్ మీల్ ఆకలిని తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల బింజ్ ఈటింగ్ ను అంటే రోజు మధ్యలో తినే చిరుతిళ్లను తినడం తగ్గుతుంది. అంతేకాదు జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయడానికి అవసరమయ్యే మంచి బాక్టీరియాను ఈ రెసిపీ మనకు అందిస్తుంది.

- Advertisement -

ఈ రెసిపీ ఆరోగ్యానికి ఎలా మంచిదంటారా? పెరుగు ప్రొబయోటిక్. ఇకపోతే ఎండుద్రాక్షలో సులువుగా జీర్ణమయ్యే పీచుపదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. అలాంటి పెరుగు, ఎండుద్రాక్షలను కలిపి తింటే కడుపులో గుడ్ బాక్టీరియా బాగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాదు పెరుగు శరీరంలోని కొలెస్ట్రాల్ ను క్రమబద్ధీకరిస్తుంది కూడా. రక్తపోటును తగ్గించడమే కాకుండా శరీర బరువును తగ్గిస్తుంది. ఇది పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్ల వరకూ అందరికీ సులువుగా జీర్ణమయ్యే ఆరోగ్యకరమైన ఆహారం. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు పెరుగు, ఎండుద్రాక్ష రెసిపీ కడుపులో ఇన్ఫ్లమేషన్ , కడుపు ఉబ్బరాలను కూడా తగ్గిస్తుంది. దంతాలు, చిగుళ్లను సైతం ఈ రెసిపీ ఆరోగ్యంగా ఉంచుతుంది. మన కీళ్లు, ఎముకలను ద్రుఢంగా ఉండేలా కూడా ఈ ఇంటి వంటకం తయారుచేస్తుంది.

ఈ రెసిపీని ఎలా చేయాలంటే గోరువెచ్చగా ఉన్న పాలను ఒక బౌల్ లో తీసుకోవాలి. అందులో నాలుగైదు ఎండుద్రాక్షలను వేయాలి. తర్వాత ముందురోజు రాత్రి తోడెట్టిన పెరుగును కొద్దిగా ఆ పాలల్లో వేసి స్పూనుతో బాగా కలపాలి. ఆ తర్వాత ఎనిమిది గంటలపాటు దాన్ని అలాగే ఉంచాలి. తర్వాత ఆ పాలు గడ్డపెరుగులా తయారవుతుంది. ఈ రెసిపీని లంచ్ టైములో తినొచ్చు. లేదా సాయంత్రం నాలుగు గంటల సమయంలో కూడా తినొచ్చు. దీన్ని తింటే కడుపు నిండుగా ఉండి చాలాసేపు ఆకలి వేయదు.

మరి మీరూ ఈ రెసిపీని తినండి..ఆరోగ్యంగా ఉండడం…బరువు తగ్గండి….ఏమంటారు?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News