Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: తగ్గేదేలే.. రెండు నిమిషాల్లో లోపల వేస్తాం: లోకేష్

Nara Lokesh: తగ్గేదేలే.. రెండు నిమిషాల్లో లోపల వేస్తాం: లోకేష్

Nara Lokesh| సీఎం చంద్రబాబు(CM Chandrababu) తలుచుకుంటే వైసీపీ నేతలను రెండు నిమిషాల్లో లోపల వేయొచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రస్తుతం ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు అమెరికా పర్యటనలో ఉన్న లోకేష్.. అట్లాంటాలో దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్(NTR) విగ్రహాష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం టీడీపీ నేతలు, కార్యకర్తలు, తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్‌ఆర్‌ఐలను ఇకపై మోస్ట్ రిలయబుల్‌ ఇండియన్స్‌(MRI)లుగా అభివర్ణించారు. ఉన్నత చదువులు కోసం చాలా మంది అమెరికా వచ్చారని… కానీ వారి మనసు ఎప్పడూ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటుదని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

ఇక రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ.. రెడ్‌బుక్‌లో ఇప్పటికే రెండు చాప్టర్‌లు ఓపెన్ అయ్యాయని తెలిపారు. ఇప్పుడు మూడో చాప్టర్‌ ఓపెన్ చేస్తున్నామన్నారు. రెడు బుక్ విషయంలో తగ్గేదే లేదని లోకేష్ తేల్చిచెప్పారు. చట్లాన్ని ఉల్లంఘించి తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఆనాడు రెడ్ బుక్ గురించి చెబితే వెక్కిరించిన వైసీపీ నేతలు ఇప్పుడు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో గుడ్ బుక్ అంటూ ఏదో రాస్తున్నారని సెటైర్లు వేశారు.

ఏ తప్పు చేయని చంద్రబాబును 52 రోజులు జైల్లో వేసే హింసించారని.. అంత బాధ పడిన చంద్రబాబు ఇప్పుడు తలుచుకుంటే రెండు నిమిషాల్లో వైసీపీ నేతలను జైల్లో పెట్టొచ్చన్నారు. కానీ ఆయన ఆ పని చేయలేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే ఆయన ఆలోచనగా ఉందన్నారు. దారి తప్పిన రాష్ట్రాన్ని దారిలో పెట్టాలని పెట్టుబడులు తీసుకురావాలని.. ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని నిరంతరం ఆలోచిస్తూ పాలన చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లు రాష్ట్రానికి పెట్టుబడులు రాని విషయం గుర్తించిన ప్రజలు ఎన్నికల్లో అతి పెద్ద తీర్పు ఇచ్చారన్నారు. ప్రజల తీర్పును గౌరవించి హుందాగా ఉండాలని ఎమ్మెల్యేలకు సూచించానని లోకేష్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News