Friday, November 1, 2024
HomeతెలంగాణSCR Principal Chief Operations Manager B. Nagya retired: దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్...

SCR Principal Chief Operations Manager B. Nagya retired: దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ నాగ్య పదవీ విరమణ

రిటైర్మెంట్..

దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ గా పదవీ విరమణ పొందారు బి. నాగ్య.
వారు తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ వాస్తవ్యులు. ఎన్.ఐ.టి /వరంగల్ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో బి.టెక్, ఐ.ఐ.టి./ఢిల్లీ నుండి ఎమ్.టెక్ ను విజయవంతగా పూర్తి చేశారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ 1989 బ్యాచ్‌కు చెందిన వీరు 1991 సంవత్సరంలో 15 సెప్టెంబర్‌న రైల్వే సేవలో ఉద్యోగ ప్రస్థానం చేశారు.

- Advertisement -

33 ఏళ్ల సేవలకు రిటైర్మెంట్..

భారతీయ రైల్వేలో 33 సంవత్సరాలపాటు విజయవంతమైన సేవలను అందించారు. వారు పూర్ణ, రామగుండం-భద్రాచలం రోడ్ మొదలైన ప్రాంతాలలో ఏరియా ఆఫీసర్ గా, కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బల్లి లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ గా, గుంతకల్లు, పాల్ఘాట్ డివిజన్ లలో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ గా, సికింద్రాబాద్ లో డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్/ఫ్రైట్/, హుబ్బల్లిలో చీఫ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్ గా, భువనేశ్వర్లో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ గా వివిధ హోదాల్లో తన భాద్యతలను నిర్వర్తించారు.
హుబ్బల్లిలో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ గా బాధ్యతలు నిర్వహించే సమయంలో అత్యంత కష్టతరమైన కాజిల్ రాక్ నుండి కులెం వరకు రైళ్లకు ఘాట్ క్లియరెన్స్‌ను విజయవంతగా నిర్వహించేవారు. ఈ విభాగాన్ని మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్ కి మార్చినప్పుడు, ఘాట్‌పై ఇనుప ఖనిజం తరలింపుపై భారీ ఒత్తిడి ఏర్పడింది, ఖాళీలను తిరిగి లోడింగ్ పాయింట్‌లకు తీసుకురావడం జరిగింది. ఈ సమయంలో ఇబ్బందులు, కఠినమైన పని ఉన్నప్పటికీ, దక్షిణ మధ్య రైల్వేలో భాగంగా హుబ్లి డివిజన్ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఆపరేటింగ్ షీల్డ్‌ను పొందింది. ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్/ఫ్రైట్ గా సేవ చేయడానికి పూర్వం గుంతకల్లు డివిజనల్ లో సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనేజర్ గా సేవలను అందిస్తుండేవారు.
రైల్వే సేవలో వారి ముఖ్యమైన భూమిక ద్వారా అనేక విజయాలు చోటుచేసుకున్నాయి. వాటి వివరాలు:
(a) అధికమైన డిమాండ్ ఉన్నప్పుడు గోవా ప్రాంతంలో మెరుగైన ఐరన్ ఓర్ అన్‌లోడింగ్.
(b) డివిజన్ విభజన జరిగినప్పుడు గుంతకల్లు డివిజన్‌లో ఐరన్ ఓర్ లోడింగ్ మెరుగుపడింది.
(c) ఎస్.సి.సి.ఎల్. బోర్డు ఆమోదం లేకుండానే రైల్వేకు రూ.320 కోట్లతో సత్తుపల్లి రైల్వే లైను మంజూరు చేయబడి, ఆ తర్వాత ఖర్చు రూ.618 కోట్లుగా మారి రైల్వేకు బహుమతిగా ఇవ్వబడింది.
తన సుదీర్ఘ రైల్వే సేవలో, ఆయన దాదాపు 5 సంవత్సరాల పాటు మెస్సరస్ సింగరేణి కాలరీస్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్/ కోల్ మూవ్మెంట్ గా డిప్యుటేషన్‌పై సేవలు అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News