Saturday, November 2, 2024
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: రాజులు కూడా ఇలాంటి భవనాలు కట్టుకోలేదేమో.. రుషికొండపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu: రాజులు కూడా ఇలాంటి భవనాలు కట్టుకోలేదేమో.. రుషికొండపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu: ఓ వ్యక్తి తన విలాసవంతమైన జీవితం కోసం ప్రజలు ఇచ్చిన అధికారం అడ్డుకుపెట్టుకుని.. రుషికొండ లాంటి ప్యాలెస్ కట్టుకోవడం ప్రపంచంలో ఎక్కడా చూడలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం విశాఖలోని రుషికొండపై నిర్మించిన భవనాలను మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు పరిశీలించారు.

- Advertisement -

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘‘ఎవరూ కలలో కూడా ఊహించనిది జరిగింది. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం ఏవిధంగా కార్యక్రమాలు చేస్తాడనేది ఇక్కడి భవనాలు చూశాకే తెలిసింది. గుండె చెదిరిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. గతంలో.. మీడియా, ఇతరులు ఎంత ప్రయత్నించినా రుషికొండపై ఏం చేస్తున్నారో తెలియకుండా చేశారు. ఎన్జీటీ, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని మభ్యపెట్టారు. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా చేయగలరో అనే దానికి ఇక్కడి పరిస్థితి ఒక ఉదాహరణ. నేను, నా మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ కూడా ఇక్కడకు రావాలని ప్రయత్నించాం. ఎవరినీ రానీయకుండా చేశారు. ఇవాళ ఇక్కడ ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.. ఆ అధికారం ప్రజలే మాకు ఇచ్చారు. భవనాల్లో ఎక్కడ కూర్చున్నా సముద్రం వ్యూ కనిపించేలా కట్టారు. పూర్వం రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలు నిర్మించుకోలేదు’’ అన్నారు.

‘‘ఒక వ్యక్తి తన స్వార్థం కోసం ఇలాంటి పనులు చేశారు. ఇలాంటి విలాసవంతమైన భవనాలు నిర్మిస్తున్నారని ఊహించలేం. ప్రజాధనంతో ఇలాంటి భవనాలు కట్టుకోవడం దారుణం. బాత్‌ టబ్‌ కోసం రూ.36లక్షలు ఖర్చు చేశారు. ఫ్యాన్సీ ఫ్యాన్లు పెట్టారు. ఇలాంటి షాండ్లియర్లు కూడా నేనెక్కడా చూడలేదు. భవనాలకు మార్బుల్స్‌ విదేశాల నుంచి తీసుకొచ్చారు. చాలా దేశాలు తిరిగా.. ఎంతో మంది నేతలను చూశాను కానీ, ఎవరూ ఇలాంటి ప్యాలెస్‌లు కట్టుకోలేదు. పేదలను ఆదుకుంటామనేవారు ఇలాంటి విలాసంవంతమైన భవనాలు కట్టుకుంటారా’’అని ప్రశ్నించారు.

‘‘వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు రూ.400 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఈ భవనానికి పెట్టిన నిధులు ఖర్చు పెడితే రోడ్లపై గుంతలు పూడ్చటం పూర్తయ్యేది. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో పనికివస్తారా? ప్రజలు ఆలోచించాలి. ఈ భవనాలు అందరికీ చూపిస్తాం. వీటిని దేనికి వాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ప్రజాధనం దోచుకుని గతంలో ఊరికొక ప్యాలెస్‌ కట్టుకున్నారు. అధికారంలో శాశ్వతంగా ఉంటాననే భ్రమలతో ఇలాంటివి కట్టారు’’ అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News