Friday, November 22, 2024
HomeతెలంగాణMahesh Kumar Goud: సీఎం మార్పు ప్రచారంపై టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు

Mahesh Kumar Goud: సీఎం మార్పు ప్రచారంపై టీపీసీసీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు

Mahesh Kumar Goud| తెలంగాణకు త్వరలోనే కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్(TPCC chief) మహేష్‌ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఉండగా మళ్లీ కొత్త ముఖ్యమంత్రి వస్తారంటున్న ఏలేటికి బీజేపీలో అసలు గౌరవం దక్కడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఆఫీసులో ఏలేటికి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy)కి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయనే సమాచారం తమకూ ఉందని ఆరోపించారు.

- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా సాగుతోందని సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వతంత్రంగా పని చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని విషయాలు మహేశ్వర్ రెడ్డికి ఏం తెలుసని ప్రశ్నించారు. తమకు ఎవరు మంత్రులు, ముఖ్యమంత్రులు అనేది ముఖ్యం కాదని.. ప్రజలు మేలు ప్రజాపాలన అందించడమే ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి వేరే పార్టీ వాళ్ళు మాట్లాడితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

ఇక ప్రభుత్వం చేపట్టబోయే కులగణనపై నవంబర్ 5వ తేదీ సాయంత్రం బోయినపల్లిలోని కాంగ్రెస్ ఐడియాలజీ సెంటర్ లో పీసీసీ ఆధ్వర్యంలో మేధావుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించబోతున్నామన్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Ghandi) పాల్గొంటారని చెప్పారు. ప్రధాని మోడీ ఎప్పుడూ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని, ఆయన ప్రశ్నలను సైతం అంగీకరిచరని విమర్శించారు. కానీ రాహుల్ మాత్రం అందుకు భిన్నంగా విమర్శలను కూడా పాజిటివ్‌గా తీసుకుంటారని వెల్లడించారు.

కాగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త సీఎం రాబోతున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanthreddy)కి కౌంట్ డౌన్ మొదలైందని.. త్వరలోనే ఆయన సీఎం కుర్చీకి ఎసరు పడబోతుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఏడు సార్లు ఢిల్లీకి వెళ్లినా రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకలేదన్నారు. అలాగే కేరళలో కనీసం ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)ని కలవాలని ప్రయత్నించినా దర్శనభాగ్యం కలగలేదన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2025 జూన్ నెల నుంచి డిసెంబర్ మధ్‌యలో తెలంగాణకు కొత్త సీఎం వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ ముమ్మరంగా కసరత్తు చేస్తోందని.. అదే సమయంలో ఆశావహులు కూడా సీఎం పోస్టు కోసం పోటీ పడుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News