Tuesday, November 5, 2024
Homeఇంటర్నేషనల్Canada: కెనడాలో హిందువులపై ఖలీస్తానీలు దాడి.. తీవ్రంగా ఖండించిన భారత్

Canada: కెనడాలో హిందువులపై ఖలీస్తానీలు దాడి.. తీవ్రంగా ఖండించిన భారత్

Canada| భారత్-కెనడా దేశాల మధ్య ఉద్రిక్తతల పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఖలీస్తానీలకు కెనడా ప్రభుత్వం మద్దతు ఇస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొన్ని విషయం విధితమే. ఈ క్రమంలోనే కెనడాలో నివసిస్తున్న హిందువుల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. తాజాగా ఆ దేశంలో నివసిస్తున్న హిందువులపై నిరంతరాయంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. బ్రాంప్టన్‌లో ఖలీస్తానీలు హిందూ ఆలయం వెలుపల నిర్వహిస్తోన్న కాన్సులర్ క్యాంప్‌పై దాడి చేసి భక్తులను కొట్టారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

- Advertisement -

కాగా ఈ ఘటనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justine trudeau) తీవ్రంగా ఖండించారు. బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంలో జరిగిన హింసాత్మక ఘటనలు ఆమోదయోగ్యం కాదని తెలిపారు. కెనడాలో నివసిస్తున్న పౌరులందరూ తమ మత విశ్వాసాలను ఆచరించే స్వేచ్ఛ ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనపై తక్షణమే స్పందించి దర్యాప్తు ప్రారంభించిన పీల్ ప్రాంతీయ పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రతి కెనడియన్‌కు తమ విశ్వాసాన్ని స్వేచ్ఛగా, సురక్షితంగా ఆచరించే హక్కు ఉందని ట్రూడో స్పష్టం చేశారు.

ఈ దాడులపై కెనడా ప్రతిపక్ష కన్జర్వేటీవ్‌ పార్టీ నేత పియర్రె పొయిలీవ్రే తీవ్రంగా స్పందించారు. ప్రతి ఒక్కరికి వారి మతవిశ్వాసాలను పాటించే స్వేచ్ఛ ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ గందరగోళ పరిస్థితులకు ముగింపు పలుకుతానని తేల్చిచెప్పారు. మరోవైపు ఈ దాడి ఘటనపై ఇండియన్ హైకమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దీని వెనక భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయని ఆరోపించింది. ఇలాంటి చర్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయని.. భారత పౌరుల భద్రత పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నామని వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News