Friday, November 22, 2024
HomeNewsRajanna Sirisilla: టీచర్ల అసంబద్ధమైన సర్దుబాటును వెంటనే సవరించాలి

Rajanna Sirisilla: టీచర్ల అసంబద్ధమైన సర్దుబాటును వెంటనే సవరించాలి

డిమాండ్

డిటిఎఫ్ ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలో మంగళవారం రోజు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు తూముకుంట నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని వివిధ పాఠశాలలో విరివిగా సభ్యత్వ నమోదు చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు దొంతుల శ్రీహరి మాట్లాడుతూ ఉపాధ్యాయుల అసంబద్ధమైన సర్దుబాటును వెంటనే సవరించాలని జిల్లా విద్యాశాఖను డిమాండ్ చేశారు. అలాగే నెలల తరబడి పేరుకుపోతున్న సప్లమెంటరీ బిల్స్ ను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సభ్యత్వ నమోదులో పాల్గొన్న రాష్ట్ర కౌన్సిలర్ ఆర్.రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారంగా 317 బాధితులకు సత్వర న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మండల శాఖ అధ్యక్షులు తూముకుంట నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, 5 DA బకాయిలకు గాను కేవలం ఒకే ఒక డిఏ ఇచ్చి, అదికూడా సిపిఎస్ వారికి 17 వాయిదాలుగా చెల్లించడం చాలా విచారకరమని నిరసన తెలియజేశారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల శాఖ జిల్లా కౌన్సిలర్లు మధు, కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి,ఎస్ రమేష్,స్వామి రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News