Friday, November 22, 2024
HomeతెలంగాణTelangana Govt: టెండర్ రద్దు చేసి బీఆర్ఎస్ కి షాకిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

Telangana Govt: టెండర్ రద్దు చేసి బీఆర్ఎస్ కి షాకిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం

బీఆర్ఎస్ పార్టీ మెఘా సంస్థను బూచిగా చూపిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఓ ప్రాజెక్టుకు సంబంధించిన గత ప్రభుత్వం లో తీసుకున్న కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ విభాగం బుధవారం జీవో జారీ చేసింది.

- Advertisement -

2017లో గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణాన్ని తలపెట్టింది. దీనికి సంబంధించిన టెండర్లను మెఘా ఇంజినీరింగ్ సంస్థ దక్కించుకుంది. తాజాగా కేశవాపురం కాంట్రాక్టులను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్ కి, అక్కడి నుంచి హైదరాబాద్ కి తాగునీటి అవసరాల కోసం గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది. ఈ కాంట్రాక్టును మెఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇవ్వగా… కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ విభాగం జీవో జారీ చేసింది. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో కేశవాపురం రిజర్వాయర్ అందులో భాగంగా చేపట్టే పనులకు అయ్యి దాదాపు రూ. 2వేల కోట్లు ఖర్చు ఆదా కానుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

బీఆర్ఎస్ కి కౌంటర్…

కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్టును రద్దు చేస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో బీఆర్ఎస్ కి కౌంటర్ ఇచ్చినట్లయింది. మెఘా సంస్థతో సీఎం కుమ్మక్కయ్యారని, ఆ సంస్థకి ప్రాజెక్టులు అప్పజెప్పి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కమిషన్లు తీసుకుంటున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మెఘా సంస్థకి ఇస్తే ఆంధ్రా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడెలా అదే సంస్థకి ప్రాజెక్టులు కట్టబెడతారని ప్రశ్నిస్తున్నారు. ఆ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మెఘా కంపెనీకి ఇచ్చిన కీలక కాంట్రాక్టును ప్రభుత్వం రద్దు చేయడం కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినట్లయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News