Wednesday, November 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Modi- Trump: డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనల వెల్లువ

Modi- Trump: డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనల వెల్లువ

Modi- Trump| అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌కు భారత ప్రధాని మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. కంగ్రాట్స్ మై ఫ్రెండ్ అంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. గతంలో ఇద్దరు కలిసి పలు వేదికల్లో దిగిన చిత్రాలను పంచుకున్నారు. ‘‘చరిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump)కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మునుపటి పదవీకాల విజయాలకు తగ్గట్టుగా.. భారత్‌-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేద్దాం. ప్రపంచ శాంతి, సుస్థిరత్వం, శ్రేయస్సు కోసం పాటుపడదాం’’ అని రాసుకొచ్చారు.

- Advertisement -

డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అభినందనలు తెలిపారు. “గ్లోబల్ వ్యవహారాలకు బలమైన మరియు శాంతి ఆధారిత విధానానికి అధ్యక్షుడు ట్రంప్ నిబద్ధతను అభినందిస్తున్నాను. రష్యాతో యుద్ధం ముగింపు దిశగా కృషిచేస్తారని ఆశిస్తున్నాను” అని పోస్‌ చేశారు.

NATO చీఫ్ మార్క్ రుట్టే మాట్లాడుతూ..అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. నాటో కూటమిని పటిష్టంగా ఉంచడానికి ట్రంప్ నాయకత్వం మళ్లీ కీలకం అవుతుందన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు. నాలుగేళ్లు కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తెలిపారు. వీరితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతలు ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ఏపీ సీఎం చంద్రబాబు కూడా ట్రంప్‌కు అభినందనలు తెలిపారు. అమెరికాను ముందుకు నడిపించే ప్రక్రియలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ట్రంప్‌ మొదటి పదవీ కాలంలో ఇండో-యూఎస్‌ సంబంధాలు గణనీయంగా బలోపేతమయ్యాయని గుర్తు చేశారు. ప్రధాని మోదీ, ట్రంప్‌ నాయకత్వంలో భారత్, అమెరికా దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రెండు దేశాలు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.

అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ట్రంప్ విజయంపై స్పందించారు. “అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు నా హృదయపూర్వక అభినందనలు. అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఓ చారిత్రాత్మక విజయం. ఇక ఇది ఏపీ ప్రజలకు చాలా అద్భుతమైన క్షణం. పశ్చిమగోదావరి జిల్లా మూలాలు ఉన్న ఉషా వాన్స్ భర్త జేడీ వాన్స్ అమెరాకా ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం గర్వకారణం. ఏపీ మూలాలకు చెందిన వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో తమదైన ముద్ర వేస్తున్నందుకు గర్విస్తున్నాం” అని ట్వీట్ చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అన్‌స్టాపబుల్‌ విజయం అందుకున్న రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసిన వారందర్నీ బాలయ్య అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News