పటాన్చెరు-బొల్లారం పారిశ్రామిక వాడల రసాయన కాలుష్యంపై సీనియర్ పాత్రికేయులు ఎస్ చంద్రశేఖర శర్మ రచించిన ఒక విధ్వంసం-1056/90 పుస్తకాన్ని బుధవారం తెలంగాణ డిప్యుటీ సీఎం భట్టీ విక్రమార్కకు అందజేశారు. 40 సంవత్సరాలుగా స్థానిక ప్రజలు, మేధావులు జరిపిన ప్రజాపోరాటం మొదలు సుదీర్ఘమైన న్యాయపోరాటాన్ని ఈ పుస్తకంలో రచయిత వివరంగా రాశారు. ఈసందర్భంగా రచయిత శర్మను భట్టీ అభినందించారు.