ఈడీ నోటీసులు వచ్చాయన్న వార్తలపై మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి (Malla Reddy) స్పందించారు. తనకి నోటీసులు వచ్చాయన్న వార్తలు అవాస్తవమని చెప్పారు. తమ ఇంటికి ఈడీ నుంచి నోటీసులు వచ్చిన మాట వాస్తవమేకానీ, తనకు ఎటువంటి నోటీసులు రాలేదని చెప్పారాయన. గతేడాది మాకు చెందిన కళాశాలల్లో ఈడీ సోదాలు జరిగిన మాట వాస్తవమే అని తెలిపారు. ఆ విచారణకు హాజరుకావాలని నోటీసులు వచ్చాయి, అందులో కొత్తేమీ లేదు అన్నారాయన. అయినా నోటీసులు నాకు రాలేదు. మా కొడుక్కు వచ్చాయి అని మల్లారెడ్డి వెల్లడించారు.
కాగా, గతేడాది మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ ఈడీ ఈ మల్లారెడ్డి కుమారుడికి నోటీసులు జారీ చేసింది. వారి కాలేజీల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకుంది. ఈ కేసు విచారణకు హాజరుకావాలంటూనే మల్లారెడ్డి (Malla Reddy) కి ఈడీ నోటీసులు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి మల్లారెడ్డి తన వ్యాఖ్యలతో ఫుల్ స్టాప్ పెట్టారు. అంతేకాకుండా తనపై ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.