తిరుమల లడ్డు (Tirumala Laddu) తయారీలో కల్తీ జరిగిందనే వార్తలు శ్రీవారి భక్తులను ఆందోళనకి గురి చేశాయి. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం చెలరేగింది. ప్రస్తుత ఏపీ కూటమి ప్రభుత్వం ఇది తిరుమలపై వైసీపీ కుట్ర అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల లడ్డూ కేసులో త్వరలో విచారణ మొదలవనుంది. సీబీఐ నియమించిన బృందానికి సహాయపడేందుకు అదనంగా సిబ్బంది కావాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో సీబీఐ అనుమతి తీసుకుని మరి కొంతమంది పోలీస్ అధికారులు, సపోర్టింగ్ స్టాఫ్ నియామకం అయ్యే అవకాశం ఉంది.
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో భారీ ట్విస్ట్
గతంలో సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున విచారణ కోసం సీబీఐ డైరెక్టర్ ఐదుగురు అధికారులను నియమించారు. సీబీఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ ఎస్ వీరేష్ ప్రభు, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాటి, విశాఖ రేంజ్ డీఐజీ జెట్టి గోపీనాథ్, విశాఖ సీబీఐ ఎస్పీ మురళీ రంభ, FSSAI సలహాదారుడు డాక్టర్ సత్య కుమార్ పండా లను సీబీఐ నియమించింది. ఈ బృందం సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో పని చేస్తుందని సీబీఐ పేర్కొంది. అయితే, తిరుమల లడ్డు (Tirumala Laddu) విచారణ కోసం సీబీఐ నియమించిన బృందానికి మరి కొంతమంది అధికారులు, ఇతర స్టాఫ్ కావాలని అధికారులు కోరారు.